PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆమె అభిమానుల‌కు మాత్ర‌మే.. 10 శాతం డిస్కౌంట్ తో చికెన్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప్ర‌ముఖ న‌టి స‌న్నీలియోన్ అభిమాని.. త‌న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. స‌న్నీలియోన్ అభిమానుల కోసం బంపరాఫర్ ప్రకటించాడు. కర్ణాటకకు చెందిన ప్రసాద్ అనే వ్యక్తి డీకే చికెన్ సెంటర్‌ను నిర్వహిస్తుంటాడు. అతడికి సన్నీ లియోన్ అంటే విపరీతమైన అభిమానం. తనలాగే సన్నీ లియోన్‌ను అభిమానించే వారి కోసం అతడు ఓ ఆఫర్ ప్రకటించాడు. తన షాప్‌నకు వచ్చే సన్నీ అభిమానులకు చికెన్ కాస్ట్‌లో 10 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్టు ప్రకటించాడు. అయితే ఎవరు పడితే వారు తాము సన్నీ అభిమానులమని వచ్చేస్తే కుదరదు. ఆ ఆఫర్ పొందాలంటే కొన్ని షరతులు వర్తిస్తాయి. డిస్కౌంట్ కోసం ఆ షాప్‌నకు వెళ్లే సన్నీ అభిమానులు ఆమెను సోషల్ మీడియాలో ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సన్నీలియోన్ ఫోటోలను తమ ఫోన్‌లో డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలో సన్నీలియోన్ ఫోటోలు, వీడియోలకు లైక్స్ కొట్టాలి. ఈ కండీషన్స్‌ను ఫాలో అయితేనే ఇతడి చికెన్ షాప్‌లో డిస్కౌంట్ వర్తిస్తుంది.

                              

About Author