PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జ్ఞానజ్యోతిని వెలిగించేది..గురువు మాత్రమే..

1 min read

శ్రీ విశాఖ శారద పీఠాధిపతులు ఉత్తరాధికారి శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి

పల్లెవెలుగు వెబ్​: సమాజాన్ని సరైన మార్గంలో నడిపించాలన్నా… మనిషి మనసులో అధర్మాన్ని శుద్ధి చేసి.. జ్ఞానజ్యోతిని వెలిగించేది ఒక్క గురువు మాత్రమే అని పేర్కొన్నారు శ్రీ విశాఖ శారద పీఠాధిపతులు ఉత్తరాధికారి శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి.  కర్నూలు నగరంలోని సూర్యదేవాలయంలో ఆదివారం ఆయన స్వామిని ప్రత్యేక దర్శనం చేసుకుని పూజలు చేశారు. అంతకు ముందు సూర్యదేవాలయం ట్రస్టు సభ్యుడు రామకృష్ణ, దేవాలయ కమిటీ బృందం పీఠాధిపతికి ఘనస్వాగతం పలికారు.  ఈ సందర్భంగా శ్రీశ్రీ స్వాత్మానందేద్ర సరస్వతి స్వామి మాట్లాడుతూ.. అన్యాయం నుండి న్యాయాన్ని మరియు అసమానత నుండి సమానత్వాన్ని గుర్తించే జ్ఞానాన్ని గురువు ప్రసాదిస్తాడు. గురువు మానవులను మహాపురుషులుగా మారుస్తాడు .గురువు సమాజాన్ని సరైన మార్గంలో నడిపిస్తాడు. సనాతన వైదిక ధర్మం ఎడారి మతాల నుండి తీవ్రమైన ముప్పు మరియు విధ్వంసానికి గురవుతున్న సమయంలో  పరమశివుడు జగద్గురువుగా అవతరించాడని వెల్లడించారు.

పునర్జీవనోద్యమంలో… భాగంగా…

  • శ్రీ ఆదిశంకరాచార్య స్వామి వారు తన అద్వైత సిద్ధాంతం ద్వారా వైదిక ధర్మాన్ని రక్షించి పునరుద్దానం చేయడానికి ఈ పునర్జీవనోద్యమంలో భాగంగా శంకరాచార్యుల అద్వైత సిద్ధాంతం ఆధారంగా దేశవ్యాప్తంగా అనేక స్వతంత్ర వైదిక పీఠాలు స్థాపించబడ్డాయి.  అనేక పీఠాలలో విశాఖ శ్రీ శారదా పీఠం విశిష్టత మరియు విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది. హిందూ ధర్మ ప్రచార యాత్రలో భాగంగా పంచారామ ఆదివారం శ్రీ విశాఖ శారద పీఠాధిపతులు ఉత్తరాధికారి శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి సూర్యదేవాలయంను దర్శించుకున్నారు.  భక్తులు  అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

About Author