ఒక్కే ఒక్క కరోన కేసు.. దేశమంతా మూడు రోజులు లాక్ డౌన్ !
1 min readపల్లెవెలుగు వెబ్ : న్యూజిలాండ్ లో మంగళవారం ఒకే ఒక్క కరోన కేసు బయటపడింది. దీంతో దేశంలో మూడు రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రధాని జెసిందా ఆర్డెర్న్ ప్రకటించారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి లాక్ డౌన్ ప్రారంభమవుతుందని ప్రధాని వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా జనం నిత్యవసర మార్కెట్ల వద్ద క్యూలో నిలబడ్డారు. ఆక్లాండ్ లోని ఓ వ్యక్తికి కరోన సోకింది. అతను కోరమాండల్ ప్రాంతంలో కూడ సంచరించాడు. దీంతో ఆ రెండు ప్రాంతాల్లో మొత్తం వారం రోజుల పాటు లాక్ డౌన్ విధించారు. ఆ వ్యక్తికి కరోన ఎలా సోకిందనే విషయం పై నిపుణులు పరిశోధనలు చేస్తున్నారు. ప్రపంచమంతా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో వైరస్ కు అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. వైరస్ ను కట్టడి చేయడం కాకుండా… అసలు లేకుండా చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రధాని తెలిపారు.