NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అలా చేసిన‌ప్పుడే క‌రోన అంతమ‌వుతుంది !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : క‌రోన మ‌హామ్మారికి అంతం ఎప్పుడు ?. ఇది అంద‌రినీ వేధిస్తున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జ‌న‌ర‌ల్ టెడ్రోస్ అధానామ్ స‌మాధానం చెప్పారు. క‌రోన అంతం మాన‌వాళి చేతుల్లోనే ఉంద‌ని చెప్పారు. మాన‌వాళి అంతం చేయాల‌ని అనుకున్నప్పుడు క‌రోన అంతం అవుతుంద‌న్నారు. వైర‌స్ ను అంతం చేయ‌గ‌ల సాధానాలు అన్నీ మాన‌వాళి ద‌గ్గర ఉన్నాయ‌ని చెప్పారు. స‌మ‌ర్థమైన ప్రజారోగ్య సాధ‌నాలు, ఔష‌ధాలు ఉన్నాయ‌ని, కానీ వాటిని స‌రైన రీతిలో మాన‌వాళి ఉప‌యోగించుకోవ‌డం లేద‌ని తెలిపారు. ప్రతి వారం ప్రపంచ వ్యాప్తంగా 50 వేల మంది క‌రోన బారిన ప‌డుతున్నార‌ని చెప్పారు. ఆరోగ్యమ‌నేది సంప‌న్నుల హ‌క్కు కాద‌ని, ప్రజ‌లంద‌రి ప్రాథ‌మిక హక్కు అని చెప్పారు. ఏ దేశం కూడ ప్రపంచం నుంచి వేరుప‌డి క‌రోన మ‌హామ్మారిని అంతం చేయ‌లేద‌ని తేల్చిచెప్పారు.

About Author