క్రమశిక్షణతోనే విద్యార్థులు ఉన్నతమైన శిఖరాలను అధిరోహించగలరు
1 min read– మైనార్టీ జిల్లా అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్, అర్బన్ సీఐ సుధాకర్ రెడ్డి..
పల్లెవెలుగు అన్నమయ్య జిల్లా రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం నిదా టెక్నో స్కూల్ లో ఎస్ ఎస్ ఎస్సీ వీడ్కోలు (ఫేర్ వెల్ ఫంక్షన్) జరిగిన కార్యక్రమంలో వీరు అర్బన్ సీఐ సుధాకర్ రెడ్డి,వైకాపా విభాగం మైనార్టీ జిల్లా అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్,ప్రభుత్వ హిందీ ఉపాధ్యాయులు హసీమ్ లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.వీరికి స్కూల్ చైర్మన్ నిసార్ అహ్మద్ వారి ఉపాధ్యాయ బృందం ఘన స్వాగతం పలికారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతు విద్యార్థి దశ నుండే విద్యార్థులు క్రమ శిక్షణ కలిగి ఉండాలన్నారు.గతంలో చదువుకోనేందుకు అనేక ఆర్థిక సమస్యలు వుండేవి.ప్రస్తుతం అలా కాదు చదువుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందిస్తున్నారాన్నరు. మరి కొద్ది రోజుల్లో జారుగునున్న పది పబ్లిక్ పరీక్షలలో ప్రతి ఒక్కరు మంచి మార్కులు సాధించాలని మనస్ఫూర్తిగా కొరు కొంటున్నమన్నరు.అదే విధంగా పదవ తరగతి ఫ్రేసర్స్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో హసీం,కరస్పాండెంట్ షేక్ హజీర,ప్రిన్సిపల్ అరాఫత్ అర్జమండ్,వైస్ ప్రిన్సిపాల్ మహబూబ్ బాషా తో పాటు ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.