గణితంతోనే..భవిష్యత్: హరికిషన్
1 min readశ్రీ శంకరాస్ డిగ్రీ కళాశాలలో… గణిత శాస్త్ర దినోత్సవం
పల్లెవెలుగు వెబ్: విద్యార్థులు ఇష్టపడి.. అర్థం చేసుకుని చదివితే… గణితం సబ్జెక్టు సులభంగా ఉంటుందన్నారు శ్రీ శంకరాస్ డిగ్రీ కళాశాల డైరెక్టర్ బి. హరికిషన్. గురువారం గణిత శాస్ర్త దినోత్సవంను ప్రిన్సిపల్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హరికిషన్ మాట్లాడుతూ కొందరు విద్యార్థులు గణితం అంటేనే భయపడుతున్నారని, చదువులో మెళకువలు పాటిస్తే సులభతరంగా ఉంటుందన్నారు. గణితంతోనే మంచి భవిష్యత్ ఉంటుందన్న హరికిషన్.. చదువుతోపాటు ప్రాక్టికల్ గా రాణించాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రిన్సిపిల్ శ్రీనివాసులు మాట్లాడుతూ గణిత శాస్ర్తవేత్త రామానుజన్ … గణితం అభివృద్ధికి చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. విద్యార్థులు గణిత శాస్ర్తంలో రాణించాలని కోరారు. అంతకు ముందు గణిత శాస్ర్తవేత్త రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. .అనంతరం విద్యార్థులకు , క్విజ్, సెమినార్లు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. కార్యక్రమంలో కళాశాల అకాడమిక్ అడ్వైజర్ వసంత కుమారి,గణిత శాస్త్ర అధ్యాపకులు మాధవి,బషీర్ , సవిత,మధు శేఖర్,ఇంగ్లీష్ అధ్యాపకురాలు సుమలత మరియు విద్యార్థులు పాల్గొన్నారు.