గ్రామాల అభివృద్దితోనే.. దేశాభివృద్ధి: తులసమ్మ
1 min read
పల్లెవెలుగు వెబ్,చాగలమర్రి: గ్రామాలు అభివృద్ది చెందినప్పుడే దేశాభివృద్ది చెందుతుందని చాగలమర్రి మేజర్ గ్రామ పంచాయతి సర్పంచ్ తులసమ్మ తెలిపారు.ఆదివారం జాతి పిత మహత్మా గాంధి జయంతి సందర్భంగా స్థానిక మేజర్ గ్రామ పంచాయతి కార్యాలయ ఆవరణంలో ఎంపిపి వీరభద్రుడు,సర్పంచ్ తులసమ్మలు గాంధి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం గ్రామ సభలో సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ది కొరకే గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందన్నారు.సీజనల్ వ్యాధులకు ప్రజలు గురికాకుండా పారిశుధ్య మెరుగుకు చర్యలు చేపట్టామన్నారు.అనంతరం 73 వ రాజ్యాంగ సవరణ లో గల 29 అంశాలపై ఈ గ్రామ సభలో చర్చించారు.కార్యక్రమం లో మండల ఉపాధ్యక్షుడు ముల్లా రఫీ,ఈఓఆర్‌డి నాగేంద్రయ్య,ఈఓ సుదర్సనరావు,వార్డు,ఎంపిటీసీ సభ్యులు,పంచాయతి,సచివాలయాల సిబ్బంది,వాలంటీర్లు పాల్గొన్నారు.
