PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ధరల ను స్థిరీకరించడానికి  ఓపెన్ మార్కెట్ స్కేల్ స్కీమ్..

1 min read

– నేడు ఈ-వేలం లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా  అందుబాటులో..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా :  దేశవ్యాప్తంగా గోధుమలు/ గోధుమ పిండి మరియు బియ్యం రిటైల్ ధరలను స్థిరీకరించడానికి ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ (డొమెస్టిక్) ద్వారా బహిరంగ మార్కెట్‌లో గోధుమలు మరియు బియ్యాన్ని విడుదల చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. పెరుగుతున్న బియ్యం మరియు గోధుమల ధరలను నియంత్రించడానికి, ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ (డొమెస్టిక్) కింద 25 LMT బియ్యం మరియు 50 LMT గోధుమలను ఆఫ్‌లోడ్ చేయాలని నిర్ణయించారు. దీనికొరకు ప్రతివారం జరుగు ఇ-వేలం  ద్వారా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు 2 LMT గోధుమలను అందుబాటులో వుంచుతారు. పైన పేర్కొన్న వాటి అమలు కోసం, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ప్రాంతీయ కార్యాలయం, అమరావతి 16.08.2023 (బుధవారం)న నిర్వహించబడే ఇ-వేలం ద్వారా OMSS (D) కింద 1550 మెట్రిక్ టన్నుల గోధుమలు మరియు 13200 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అందుబాటులో వుంచుతారు. ప్రస్తుతం 775443 MTల బియ్యం మరియు 11499 MTల గోధుమలు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ వద్ద అందుబాటులో ఉన్నాయి. పైన పేర్కొన్న వాటికి అదనంగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సెంట్రల్ పూల్ కింద రాష్ట్ర ప్రభుత్వం వద్ద 840000 MTల బియ్యం అందుబాటులో వున్నవి. ఇ-వేలంలో పాల్గొనడానికి, EMD మొత్తాన్ని ఎలక్ట్రానిక్ మోడ్ ద్వారా జనరల్  మేనేజర్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ప్రాంతీయ కార్యాలయం, అమరావతి వారి బ్యాంకుఖాతాకి సోమవారం (14.08.2023) సాయంత్రం 6 గంటలలోపు జమ చేయాలి. ఇప్పటినుండి ఒక PAN కలిగివున్న కొనుగోలుదారుడు దేశవ్యాప్తంగా 100 మెట్రిక్ టన్నుల గోధుమలను మాత్రమే వేలంలో  పొందుటకు అనుమతించబడతారు. కొనుగోలుదారుడు ఆ నిర్దిష్ట రాష్ట్రంలో చెల్లుబాటు అయ్యే GST రిజిస్ట్రేషన్ మరియు టెండర్‌ను ప్రచురించిన తేదీ నాటికి చెల్లుబాటు అయ్యే FSSAI లైసెన్స్‌ని కలిగివుండాలి. ఆసక్తి ఉన్న పిండి మిల్లర్లు/ గోధుమ పిండి ప్రాసెసర్‌లు మరియు గోధుమ ఉత్పత్తుల తయారీదారులు తదుపరి నమోదు మరియు E-వేలంలో పాల్గొనేందుకు www.valuejunction.in/fciలో M-జంక్షన్‌ని సంప్రదించవచ్చు. FCI నుండి ఇ-వేలంలో గోధుమలను పొందిన బిడ్డర్లు, అలా పొందిన గోధుమలను పొందిన చివరి తేదీ నుండి ముప్పై (30) రోజులలోపు గోధుమ ఉత్పత్తులుగా ప్రాసెస్ చేసి, విక్రయించుట కోసం మార్కెట్‌లోనికి విడుదల చేయాలి. FCI నుండి ఇ-వేలంలో గోధుమలను పొందిన బిడ్డర్లు, అలా పొందిన గోధుమలను పొందిన చివరి తేదీ నుండి ముప్పై (30) రోజులలోపు  గోధుమ ఉత్పత్తులుగా ప్రాసెస్ చేసి, విక్రయించుట కోసం మార్కెట్‌లోనికి విడుదల చేయాలి. బియ్యానికి సంబంధించిన  వేలంలో, వ్యాపారులు కూడా పాల్గొనవచ్చు మరియు కొనుగోలుదారుడు 1000MTల వరకు బియ్యాన్ని వేలంలో  పొందుటకు అనుమతించబడతారు. ఇప్పుడు FRK బియ్యం రిజర్వ్ ధర క్వింటాల్‌కు రూ.2973/- మరియు FRK కాని బియ్యం రిజర్వ్ ధర క్వింటాల్‌కు రూ.2900/- లుగా నిర్ణయించబడ్డది.

About Author