నందికొట్కూరులో అజ్మీరా ట్రెండ్స్ వస్త్ర దుకాణం ప్రారంభం
1 min readముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరులోని మద్దూర్ సుబ్బారెడ్డి నగర్ నందు, పి.మార్ట్ ప్రక్కన, శివశంకర్ టాకీస్ దగ్గర శ్రీ లక్ష్మి ఫ్యాషన్స్ నందికొట్కూరు పేరుతో సూరత్ లోని అతిపెద్ద చీరల తయారీదారు అజ్మీరా ఫ్యాషన్ ప్రైవేట్ లిమిటెడ్ అజ్మీరా ట్రెండ్స్ నూతన వస్త్ర దుకాణం ప్రారంబించారు. అజ్మీరా ఫ్యాషన్ ప్రైవేట్ లిమిటెడ్ , సూరత్, గుజరాత్ కంపెనీ వారు స్వయంగా తయారు చేయబడిన సకల జనుల అభిరుచి మేరకు అత్యంత నాణ్యమైన, అద్భుతమైన కలెక్షన్స్, బెస్ట్ ప్రైస్ వాల్యూస్ తో అందమైన ఆకర్షణీయమైన రంగులతో రకరకాల మంచి మంచి డిజైన్ లతో సరసమైన ధరలకు అదుర్స్ అనిపించేలా ఉన్న ముగ్ధ మనోహరమైన చీర, కుర్తి, లెహంగా, డ్రెస్ మెటీరియల్స్, ఫ్యాన్సీ, పట్టు చీరలు, పెళ్లికూతురు పట్టుచీరల తో నూతన వస్త్ర దుకాణాన్ని ప్రారంభించారు. నూతన వస్త్ర దుకాణం ప్రారంభోత్సవ కార్యక్రమం లో నందికొట్కూరు మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నందికొట్కూరు మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ మహానగరాల్లో ఉండే వస్త్ర దుకాణాలు ఇక్కడికి రావడం సంతోషంగా ఉందన్నారు. ఇక్కడి ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లే ఇబ్బందులు తప్పాయని చెప్పారు. అనంతరం దుకాణాన్ని పరిశీలించారు.అనంతరం అజ్మీర ట్రెండ్స్ ఫ్రాంచైజీ యజమాని శ్రీ లక్ష్మీ ఫ్యాషన్స్ , నందికొట్కూరు అధినేత గుజ్జుల గణేష్ నాయుడు మాట్లాడుతూ నూతన వస్త్ర దుఃఖనమును పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఆదరించాలని కోరారు.కార్యక్రమంలో గుజ్జుల గౌరీశ్వర నాయుడు, కుటుంబ సభ్యులు, 22వ వార్డు ఇంచార్జి శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.