NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నగరంలో జి .ఆర్ టి హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రారంభం

1 min read

పల్లెవెలుగు వెబ్  విజయవాడ : భారత దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో కూడి విలాసవంతమైన ప్రఖ్యాతిగాంచిన  గ్రూపు జి ఆర్ టి హోటల్స్ అండ్ రిసార్ట్స్ వారి గ్రాండ్ విజయవాడలొ నేడు విజయవాడలోని ఎంజీ రోడ్డుకు దగ్గరగా సిటీ కేంద్రంలో  ఘనంగా ప్రారంభించామని సి ఈ ఓ విక్రమ్ కోట అన్నార. స్థానిక ఎంజీ రోడ్డులో యస్ యస్‌ కన్వెన్షన్. ప్రక్కన సీఈవో విక్రం కోట నిర్వాహకుల చేతుల మీదుగా కేక్ కట్ చేసి లాంఛనంగా .శుక్రవారం హోటల్ ప్రారంభోత్సవం జరిగింది .ఈ సందర్భంగా సీఈవో విక్రమ్ కోట మాట్లాడుతూ ఇదివరకే చెన్నై, కాకినాడలో హోటల్స్ ,  నడుస్తున్నాయని అన్నారు. అంతేకాకుండా గ్రాండ్ విజయవాడ బై జి ఆర్ టి హోటల్ అనేది జి ఆర్ టి హోటల్స్ అండ్ రిసార్ట్స్ వారికి సంబంధించిన 20 హోటల్ అని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో రెండో హోటల్ ప్రారంభించడం తనకు ఎంతో సంతోష కలిగిస్తుంది అని ,నేడు ప్రారంభించిన ఈ హోటల్ ద్వారా బిజినెస్, క్లాస్ వసతి సదుపాయాలతో పాటు విశ్రాంతి, వినోదం ,అందించే హోటల్స్ మరియు అంతర్జాతీయ హోటల్స్ నడపడంలో మా యొక్క నిబద్ధతను మరో మారు తెలియజేస్తుందని తెలిపారు.హోటల్ ప్రారంభించడం తనకు ఎంతో సంతోషం కలిగించిందన్నారు. సమకాలీన సౌకర్యాలతో బిజినెస్, మరియు విశ్రాంతి ఆశించే అతిధులు అవసరాలు తీర్చేలా తయారు చేయబడిన ఉన్నత శ్రేణికి చెందిన పూర్తిస్థాయి సేవలు అందించే హోటల్ అని వివరించారు. ఈ హోటల్ అన్ని సౌకర్యాలతో అందుబాటు ప్యాకేజీలతో అందరికీ అనుకూలంగా విజయవాడ  నడిబొడ్డున ఉందని నగర ప్రజలు చుట్టు ప్రక్కల ప్రాంతవాసులు అందరూ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నారని అన్నారు .ఈ కార్యక్రమంలో హోటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author