NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలులో…LUV MOBILES స్టోర్​ ప్రారంభం

1 min read

బనారస్​ మూవీ ఫేం కుమారి సోనాల్​

పల్లెవెలుగు వెబ్​: నాణ్యమైన స్మార్ట్​ ఫోన్​ రిటైల్​ కంపెనీ నెలకొల్పాలన్న లక్ష్యంతో సీరియల్ ఎంట్రప్రెన్యూర్ దేవరాల వెంకట సురేష్ స్థాపించిన LUV MOBILES స్టోర్​లో అతితక్కువ ధరకే మొబైల్​ లభిస్తాయన్నారు బనారస్​ మూవీ ఫేం కుమారి సోనాల్​. ఆదివారం నగరంలోని గాంధీ నగర్​ పార్క్​ రోడ్డులో  ‘లవ్​ మొబైల్​’ స్టోర్​ను ఆమె ప్రారంభించారు.  బనారస్​ మూవీ ఫేం సోనాల్​ను చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా సోనాల్​ మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలో స్థాపించిన LUV మొబైల్స్‌లో స్ట్రాటజీ, ఎగ్జిక్యూషన్  మరియు  ఆపరేషన్స్ ని లీడ్ చేస్తూ  అనతికాలంలోనే  25  స్టోర్స్ కి పైగా విస్తరించడం శుభ పరిణామమన్నారు. అనంతరం స్టోర్​ ఎండీ మాట్లాడుతూ గత రెండు దశాబ్దాలుగా రియల్ ఎస్టేట్, రిటైల్ మరియు షేర్ ట్రేడింగ్‌లో విజయవంతమైన వెంచర్‌లను నిర్మించిన వెంకట సురేష్ కర్ణాటక అంతటా మల్టిపుల్ స్టోర్‌లతో successful రిటైల్ వెంచర్‌లు కలిగి ఉన్న లోటస్ మొబైల్స్‌లో మేనేజింగ్ పార్టనర్ గా కూడా ఉన్నారు. ఆయన సతీమణి దేవరాల కవిత లోటస్ మొబైల్స్‌లో భాగస్వామి మరియు  LUV మొబైల్స్‌ COOగా  భాద్యతలు నిర్వహిస్తున్నారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ – ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చదివిన కవిత టెక్నికల్ కోఆర్డినేటర్‌గా సౌత్ ఇండియాలో  LUV మొబైల్స్‌ ని  విజయవంతంగా విస్తరించడంలో  ముఖ్యపాత్ర  వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లాలో ఒకేసారి 5  స్టోర్స్ తో  LUV  మొబైల్  స్టోర్స్ ని గ్రాండ్ లాంచ్ చేయబోతున్నారు దేవరాల వెంకట సురేష్, కవిత. మార్చి వరకు  ఆంధ్రప్రదేశ్ అంతటా  15  స్టోర్స్ కి పైగా నెలకొల్పుతూ ఆ తర్వాత అన్ని జిల్లాలకు  LUV మొబైల్స్‌ స్టోర్స్ ని విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నారు.

About Author