PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హైద‌రాబాద్‌లో ఉబ్జెకిస్థాన్ విశ్వవిద్యాల‌య కార్యాల‌యం ప్రారంభం

1 min read

* బుఖారా స్టేట్ మెడిక‌ల్ యూనివ‌ర్సిటీ (బీఎస్ఎంఐ)లో వెయ్యి మంది భార‌తీయ వైద్యవిద్యార్థులు

* వైద్య విద్యార్థుల‌తో పాటు ఆస్పత్రులు, ఫార్మా సంస్థల‌కూ ప్రయోజ‌నం

* ఉజ్బెకిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ భార‌తీయ ప్ర‌తినిధి, నియో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్  మెడిక‌ల్ సైన్సెస్ అండ్ టెక్నాల‌జీ డైరెక్టర్ దివ్యా రాజ్ రెడ్డి

పల్లెవెలుగు వెబ్ హైద‌రాబాద్ : వైద్య విద్య విష‌యంలో పార‌ద‌ర్శక‌త‌ను పెంచేందుకు ఉజ్బెకిస్థాన్‌లోని బుఖారా స్టేట్ మెడిక‌ల్ యూనివ‌ర్సిటీ (బీఎస్ఎంఐ) త‌మ అధికార ప్రతినిధి కార్యాల‌యాన్ని హైద‌రాబాద్‌లోని నియో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాల‌జీ లిమిటెడ్ వ‌ద్ద ప్రారంభించింది. ఇది వైద్యవిద్యతో పాటు ఆస్పత్రులు, ఫార్మా సంస్థలకు కూడా ఉప‌యుక్తంగా ఉంటుంది. బీఎస్ఎంఐ రెక్టార్ ప్రొఫెస‌ర్ ఎస్.డి. తెషేవ్, అంత‌ర్జాతీయ వ్యవ‌హారాల అధిప‌తి డాక్టర్ ఎలెనా ఎ క‌రిబోవా, ఉజ్బెకిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ భార‌తీయ ప్రతినిధి దివ్యా రాజ్‌రెడ్డి ఈ కార్యక్ర‌మంలో పాల్గొని, అనంత‌రం మీడియాతో మాట్లాడారు. బీఎస్ఎంఐ రెక్టార్ ప్రొఫెస‌ర్ ఎస్.డి. తెషేవ్ మాట్లాడుతూ, “ఇక్కడ మా యూనివ‌ర్సిటీ ఇండియ‌న్ రిప్రజెంటేటివ్ ఆఫీసు తెర‌వ‌డానికి మేం అధికారికంగా వ‌చ్చాం. 1990లో మా విశ్వవిద్యాల‌యంలోకి విదేశీ విద్యార్థుల‌ను తీసుకోవ‌డం మొద‌లుపెట్టాం. ఇప్పుడు 2 వేల మందికి పైగా విదేశీ విద్యార్థులు ఉన్నారు. వాళ్ల‌లో దాదాపు వెయ్యిమంది భార‌తీయులే. వీళ్లంతా ఉక్రెయిన్ ర‌ష్యా యుద్ధం వ‌ల్ల అక్క‌డినుంచి మా విశ్వ‌విద్యాల‌యానికి రావ‌డం గొప్ప ప‌రిణామం. ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు ష‌వ్‌క‌త్ మిర్జియొయెవ్‌, భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ఇద్ద‌రికీ కూడా చాలా కృత‌జ్ఞ‌త‌లు. వారు ద్వైపాక్షిక సంబంధాలు బాగా కొనసాగిస్తూ, రెండు దేశాల‌కూ విద్యావ‌కాశాలు క‌ల్పిస్తున్నారు. వైద్య విద్యార్థులు, ఆస్ప‌త్రులు, ఫార్మా సంస్థ‌లు కూడా ఇప్పుడు మా కార్యాల‌యాన్ని సంద‌ర్శించొచ్చు. మ‌రింత స‌మాచారం కోసం www.studyinuzbek.uz వెబ్‌సైట్‌, 1800-123-2931టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌ల‌ను సంప్రదించ‌వ‌చ్చు. నియో సంస్థకు ధ‌న్యవాదాలు” అని చెప్పారు. బీఎస్ఎంఐ అంత‌ర్జాతీయ వ్యవ‌హారాల అధిప‌తి డాక్టర్ ఎలెనా ఎ క‌రిబోవా మాట్లాడుతూ, “ఇండియా రిప్రజెంటేటివ్ ఆఫీసు హైద‌రాబాద్‌లో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. మా విశ్వవిద్యాల‌యం అమెరికా, పోలండ్ లాంటి చాలా దేశాల‌తో క‌లిసి పనిచేస్తోంది. కానీ, ఇక్కడ కార్యాల‌యం ఏర్పాటుచేయ‌డం విద్యార్థుల‌కు చాలా మంచి అవ‌కాశాలు ల‌భిస్తాయి. ఎన్ఎంసీ నిబంధ‌న‌లు, 2021 ఎఫ్ఎంజీఎల్ రెగ్యులేష‌న్లకు బీఎస్ఎంఐ క‌ట్టుబ‌డి, భార‌తీయ విద్యార్థుల‌కు భార‌త‌దేశంలోని ఎంబీబీఎస్‌తో స‌మాన‌మైన కోర్సు చ‌దివే అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఇందులో ఎంబీబీఎస్ ఐదేళ్లతో పాటు ఒక ఏడాది ఇంట‌ర్న్‌షిప్ కూడా ఉంటుంది. ఇది చ‌దివిన త‌ర్వాత ప‌ట్ట‌భ‌ద్రులైన డాక్ట‌ర్లు ఉబ్జెకిస్థాన్‌లోని బుఖారా రాష్ట్రంలో వైద్యులుగా ప్రాక్టీసు చేసుకోవ‌డానికి అనుమ‌తి ఉంటుంది. ఇందుకు సంబంధించిన వివ‌రాలు భార‌తీయ రాయ‌బార‌కార్యాల‌యం వెబ్‌సైట్‌లో అధికారికంగా ఉన్నాయి. భార‌తీయ విద్యార్థుల‌కు ఎన్ఎంసీ గుర్తింపు ఉంద‌న్న విష‌యం దీంతో స్ప‌ష్ట‌మ‌వుతుంది” అని తెలిపారు. నియో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్  మెడిక‌ల్ సైన్సెస్ అండ్ టెక్నాల‌జీ డైరెక్టర్ దివ్యా రాజ్ రెడ్డి మాట్లాడుతూ, “విద్యావ‌కాశాలతో పాటు వైద్య‌, ఫార్మా రంగాల్లో ఇరు దేశాల సంబంధాల‌ను బ‌లోపేతం చేయ‌డానికి ఉజ్బెకిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వశాఖ న‌న్ను వాళ్ల భార‌తీయ ప్రతినిధిగా నియ‌మించింది. అక్కడి యూనివ‌ర్సిటీలు త‌మ అధికారిక ప్రతినిధి కార్యాల‌యాల‌ను ఇక్కడ తెరిచేలా వారిని ఒప్పించినందుకు నేను చాలా గ‌ర్వ‌ప‌డుతున్నాను. ఇంత‌కుముందు తాష్కెంట్ మెడిక‌ల్ అకాడ‌మీ కూడా త‌మ కార్యాల‌యాన్ని హైద‌రాబాద్‌లో తెరిచింది. నేష‌న‌ల్ మెడిక‌ల్ క‌మిష‌న్ (ఎన్ఎంసీ) పెట్టిన నిబంధ‌న‌లు, బ‌ల‌మైన నిర్ణ‌యాల‌కు మ‌న విద్యార్థులు బాగా క‌ట్టుబ‌డి ఉండాలి. విదేశాల‌కు చ‌దువుకోవ‌డానికి వెళ్లాక త‌మ భ‌విష్య‌ ఎలా ఉంటుంద‌నే స్పష్టత లేకుండా వెళ్లి మ‌ధ్యవ‌ర్తుల చేతిలో మోస‌పోతున్నారు. ఉజ్బెకిస్థాన్, భార‌త‌దేశాల మ‌ధ్య విమాన ప్ర‌యాణం కేవ‌లం రెండు గంట‌లే కాబ‌ట్టి, ఆరోగ్యరంగంలో పేషెంట్-డాక్టర్ ఎక్స్‌ఛేంజ్ కార్యక్రమాలు పెంచాం. బీఎస్ఎంఐ, టీఎంఏల‌లో ఎంబీబీఎస్‌తో స‌మాన కోర్సుల‌ను ప్రవేశ‌పెట్టాం. నియో సంస్థ స‌హకారంతో టీఎంఏ, బీఎస్ఎంఐలు అపోలో, ఏఐజీ, య‌శోద‌, శ్రీ‌శ్రీ హోలిస్టిక్, జీఎస్ఎల్‌, ఫోర్టిస్, మేదాంత లాంటి ఆస్పత్రుల‌తో ఎంఓయూలు చేసుకున్నాయి.

టెలిమెడిసిన్ ఎక్స్ఛేంజ్ కూడా తీసుకొస్తున్నాం. వీటిలో ప‌లు ఆస్పత్రుల‌ను రెక్టార్ సంద‌ర్శించారు. అక్కడ టెలిమెడిసిన్ ఏర్పాటుచేయాల‌ని మేం నిర్ణ‌యించాం. ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు ష‌వ్‌క‌త్ మిర్జియొయెవ్ భార‌త‌దేశంలో ఫార్మారంగంతో క‌లిసి జాయింట్ వెంచ‌ర్ల ఏర్పాటుకు చాలా ఆస‌క్తిగా ఉన్నారు. బుఖారా రాష్ట్రంలో 50 మిలియ‌న్ల డాల‌ర్లతో వీటిని ఏర్పాటు చేయాల‌నుకుంటున్నారు. అందుకోసం భాగ‌స్వామ్యానికి భార‌తీయ ఫార్మా సంస్థల‌ను ఆహ్వానిస్తున్నారు. ఈ కొత్త కార్యాల‌యం కేవ‌లం విద్యావ‌కాశాలే కాక‌.. ఆస్పత్రులు, ఫార్మా రంగాల‌కూ ఒక మంచి ప్లాట్‌ఫాంగా మారుతుంద‌ని భావిస్తున్నాం” అని వివ‌రించారు.

About Author