ధరణి మోటార్స్ (పియాజియో అప్పెఆటోరిక్షా ) నూతన షోరూం ప్రారంభం
1 min read
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలలో షోరూములు ప్రారంభం,త్వరలో మరిన్ని షోరూంలు ప్రారంభిస్తాం
మేనేజర్ నడుపూరి.అనిల్
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు నగరంలోని మినీ బైపాస్ రోడ్ లో పోస్టల్ కాలనీ నందు ధరణి మోటార్స్ (పియాజియో అప్పె ఆటో రిక్షా) నూతన షోరూమ్ ను పియా జియో రీజినల్ మేనేజర్ నడుపూరు.అనిల్ చేతుల మీదగా ఘనంగా సోమవారం ప్రారంభించారు. తర్వాత వర్క్ షాప్ ను పియా జియో జోనల్ మేనేజర్ వెంకటేశ్వరరావు ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరం, తాడేపల్లిగూడెం,తర్వాత మూడోదిగా ఏలూరు పట్టణంలో పియాజియో షోరూం ప్రారంభించడం జరిగిందని, అలాగే సాయంత్రం జంగారెడ్డిగూడెంలో ప్రారంభం చేస్తామని రానున్న మే,జూన్ మాసాలలో కొవ్వూరు,నరసాపురం, ఆకివీడు,తణుకు, చింతలపూడి మొదలగు పట్టణాల్లో షోరూములు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి కంపెనీ ప్రతినిధులు, నగరంలోని వ్యాపారవేత్తలు,ఆటో షేర్ డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్లు, కుటుంబ సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు.
