ముగిసిన ఆపరేషన్ మదర్ టైగర్
1 min read– ఆచూకీ దొరకని తల్లి పులి జాడ
– తిరుపతి జూకి 4 పులి కూనల తరలింపు
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా ఆత్మకూరు డివిజన్ అటవీ ప్రాంతం కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురంలో లభ్యమైన నాలుగు ఆడ పులి పిల్లలను తల్లి వద్దకే చేర్చేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో వాటిని తిరుపతిలోని జూకి గురువారం అర్ధరాత్రి అధికారులు తరలించారు. రెండేళ్ల తర్వాత తిరిగి వాటిని నల్లమలలో వదిలేస్తామని నాగార్జున సాగర్ శ్రీశైలం పులుల అభయారణ్యం ఎఫ్ డి శ్రీనివాస రెడ్డి చెప్పారు. నాలుగు రోజుల అధికారుల ప్రయత్నం ఫలించలేదు. పేగు బంధం తెగిపోయింది. తల్లికి శాశ్వతంగా దూరమైపోయాయి నాలుగు పులి కూనలు. నంద్యాల జిల్లా పెద్దగుమ్మాడపురంలో ఆపరేషన్ మదర్ టైగర్ ముగిసిందన్నారు.
ఆపరేషన్ మదర్ టైగర్ ముగిసింది…
నాలుగు రోజుల అధికారుల ప్రయత్నం ఫలించలేదు. పేగు బంధం తెగిపోయింది. తల్లికి శాశ్వతంగా దూరమైపోయాయి నాలుగు పులి కూనలు. నంద్యాల జిల్లా పెద్దగుమ్మాడపురంలో ఆపరేషన్ మదర్ టైగర్ ముగిసింది. ఫారెస్ట్ అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా T-108 పులి ఆచూకీ చిక్కలేదు. దీంతో 4 పులి కూనలను తిరుపతి జూకి తరలించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు.గురువారం అర్థరాత్రికే తిరుపతి శ్రీ వేంకటేశ్వర జూ పార్కుకి తరలించనున్నారు. 4 రోజుల పాటు అన్వేషించినా తల్లి పులి జాడ దొరకలేదు.
పులి కూనలను గుర్తించిన గ్రామస్తులు…
తల్లి నుంచి విడిపోయి దారితప్పిన నాలుగు పెద్ద పులి పిల్లలు గ్రామంలోకి వచ్చేసిన ఘటన నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురం గ్రామ శివారులో జరిగింది. పులి పిల్లలను గమనించిన గ్రామస్తులు షాక్ అయ్యారు. ఆ తర్వాత కుక్కలు ఎక్కడ దాడి చేసి చంపుతాయోనని పులి పిల్లలను గ్రామస్తులు తీసుకెళ్లి ఓ గదిలో సేఫ్ గా ఉంచారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు పులి పిల్లలను పరిశీలించారు. పులి కూనలన్నీ ఆడవేనని, ఒకేసారి నాలుగు ఆడ పిల్లలకు జన్మనివ్వడం అరుదని అధికారులు తెలిపారు.
అధికారులకు నిరాశే ఎదురైంది..
పులి కూనలను వాటి తల్లి పులితో కలపడానికి అధికారులు అనేక ప్రయత్నాలు చేశారు. కానీ, ఫలితం లేకపోయింది. తల్లి పులి కోసం అటవీ శాఖ అధికారులు తీవ్రంగా శ్రమించినా నిరాశే ఎదురైంది. 50మందికిపైగా అటవీ అధికారులతో మొత్తంగా 300 మంది సిబ్బందితో ఆపరేషన్ తల్లి పులి నిర్వహించారు అటవీశాఖ అధికారులు. తల్లి పులి అన్వేషణ కోసం శాస్త్రీయ సాంకేతికతను కూడా ఉపయోగించారు. 40 ట్రాప్ కెమెరా లతో ట్రేస్ చేశారు. కానీ, పెద్ద పులి జాడ మాత్రం దొరకలేదు.