అనాథ పిల్లల రక్షణకే..‘ ఆపరేషన్ ముస్కాన్’
1 min read– ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్ప
పల్లెవెలుగు వెబ్, బండి ఆత్మకూరు : అనాథ పిల్లలను రక్షించడం.. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్ప తెలిపారు. జిల్లాలో రెస్క్యూ చేసిన పిల్లలకు కోవిడ్ టెస్టులు చేస్తున్నామని, పాజిటివ్ వస్తే కోవిడ్ చైల్డ్ కేర్ సెంటర్కు తరలిస్తామన్నారు. శుక్రవారం బండి ఆత్మకూరులో ఆపరేషన్ ముస్కాన్లో రక్షించిన పిల్లలతో సహపంక్తి భోజనం చేశారు. అనంతరం బాలలకు దుస్తులు పంపిణీ చేశారు. కరోనా కారణంగా తల్లిదండ్రులు చనిపోయి ఆనాధలైన పిల్లల కొరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ చిదానంద రెడ్డి, సీఐ మల్లికార్జున, ఎస్ఐలు రాజారెడ్డి, మోబీన బాన్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.