ఓపియస్ అమలు చేయాలి…ఆపస్
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ విధానాన్ని మార్పు చేస్తూ గ్యారెంటెడ్ పెన్షన్ పథకం (జీపీఎస్) అమలుకు క్యాబినెట్ ఆమోదించడాన్ని పునరాలోచించి ఒపియస్ అమలుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం(ఆపస్) రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ శ్రావణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి యస్ బాలాజీలు డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ప్రతిపక్ష హోదాలో వారంలో సిపిఎస్ రద్దు చేస్తామని ప్రకటన చేసి, మేనిఫెస్టోలో సిపిఎస్ రద్దును చేర్చడం జరిగింది మరి ఇప్పుడు ఓపిఎస్ అమలు చేయకుండా జిపిఎస్ అనే పేరుతో దాదాపుగా లక్ష యాభై వేల మంది ఉద్యోగస్తులకు జిపిఎస్ అమలు చేయాలని నిర్ణయించడం చాలా బాధాకరం అన్నారు. ఎలాంటి హామీ ఇవ్వకుండా దాదాపుగా ప్రస్తుతం 6 రాష్ట్రాలు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నారు అని గుర్తు చేశారు ప్రభుత్వం కూడా సానుకూల దృక్పథంతో జిపిఎస్ అనే విధానాన్ని కాకుండా పాత పెన్షన్ విధానాన్ని అమలుపరిచి ఉద్యోగ ఉపాధ్యాయులకు కుటుంబాలకు భద్రత ఇచ్చే విధంగా ప్రభుత్వం అడుగులు వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాo అన్నారు.ఇదే వైఖరి ప్రభుత్వం అవలంబించి జిపిఎస్ అమలు చేస్తే పోరాటాలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం సిద్ధంగా ఉందని తెలిపారు.