NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్ర‌భాస్ సినిమాలో న‌టించే అవ‌కాశం.. ఆడిష‌న్స్ ప్రారంభం

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నాగ్ అశ్విన్ దర్శకత్వంలో, వైజయంతి మూవీస్ బ్యానర్ లో ‘ప్రాజెక్ట్ కె’ అనే చిత్రంలో ప్ర‌భాస్ నటిస్తు్న్న సంగతి తెలిసిందే. సోషియో ఫాంటసీ చిత్రంగా ఆసక్తికరమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఈ సినిమా కోసం వైజయంతి మూవీస్ వారు ఆడిషన్స్ ను నిర్వహిస్తుండడం విశేషం. భవిష్యత్తు తారలు మీరే అంటూ.. ప్రభాస్ సినిమాలో నటించే ఛాన్స్ కల్పిస్తూ బంపర్ ఆఫర్ ప్రకటించింది. వయసుల వారు ఆడిషన్స్ లో పాల్గొనవచ్చు. నటులు, మోడల్స్, డ్యాన్సర్స్, మ్యూజిషియన్స్, మార్షల్ ఆర్టిస్ట్స్, పెర్ఫార్మర్స్ ఎవరైనా రావచ్చని ప్రకటనలో పేర్కొంది. తమ ప్రతిభను ఓ 30 సెకన్ల పాటు ప్రదర్శించేలా ప్రిపేరై రావాలని పిలుపునిచ్చింది. హైదరాబాద్ లోని ఫీనిక్స్ ఎరీనా వేదికగా ఆడిషన్స్ జరుగుతాయని వైజయంతి మూవీస్ తన ప్రకటనలో వెల్లడించింది. ఈ నెల 3న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ, 4వ తేదీన ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ ఆడిషన్స్ నిర్వహిస్తున్నట్టు తెలిపింది.

                                 

About Author