24 సీట్ల కోసమే ప్రతిపక్షాలు పోరాడాలి !
1 min readపల్లెవెలుగువెబ్ : పని పాటాలేని చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేస్తున్న ఆరోపణలను తిప్పి కొడతామని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ‘పవన్ చెప్పే తీరులో ఎటువంటి లాజిక్ లేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి ఎటువంటి వ్యతిరేక ఓటు లేదు. మ్యానిఫెస్టోలో ప్రకటించిన ప్రతి ఒక్క దాన్ని అమలు చేసిన మాకు, మా ప్రభుత్వానికి అనుకూల ఓటు మాత్రమే ఉంది. ప్రజల ఇతర అవసరాలు తెలుసుకునేందుకే గడపగడపకు మన ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి పోటీ చేసినా.. విడిగా పోటీచేసిన, మాకు ఊడేది ఏమీ లేదు. మిగిలిన ఇరవై నాలుగు సీట్ల కోసమే ప్రతిపక్షాలు పోరాడాలి. మా 151సీట్లు పక్కగా తిరిగి మాకు వస్తాయి’ అని కొడాలి నాని అన్నారు.