ప్రతిపక్షంలో సీబీఐ కావాలి.. అధికారంలోకి వచ్చాక వద్దా ?
1 min readపల్లెవెలుగువెబ్ : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు పై టీడీపీ నాయకుడు బోండా ఉమ స్పందించారు. వివేకా హత్య జరిగిన రోజు నుంచే ఒక పధకం ప్రకారం చంద్రబాబు, లోకేష్‌లపై వైసీపీ బురద జల్లుతుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ అన్నారు. 2019 మార్చిలో ప్రతిపక్ష నేతగా జగన్ సీబీఐ విచారణ చేయాలని కోరారన్నారు. సీఎం కాగానే సీబీఐ విచారణ అవసరం లేదని కేసు ఉపసంహరించుకుంది వాస్తవం కాదా అని బోండా ఉమ ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉంటే సీబీఐ కావాలి… అధికారంలో ఉంటే సీబీఐ విచారణ వద్దా అని నిలదీశారు. జగన్ అవినీతి పత్రిక సాక్షిలో నారాసుర రక్తచరిత్ర అని రాసుకున్నాడని బోండా ఉమ గుర్తుచేశారు. తరువాత నిందితుల పక్షాన నిలిచి కేసును నీరు గార్చారన్నారు.