NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

EHS స్టీరింగ్ కమిటీ మెంబర్ గా ఆపస్..                          

1 min read

పల్లెవెలుగు వెబ్  విజయవాడ: ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్(EHS)  అమలు తీరును సమీక్షించేందుకు గాను ఉద్దేశింపబడిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఉండే ఈహెచ్ఎస్ స్టీరింగ్ కమిటీలో ఉద్యోగుల పక్షం నుండి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం(ఆపస్) కు సభ్యత్వం కల్పిస్తూ జనరల్ అడ్మినిస్ట్రేషన్ (సర్వీసెస్ వెల్ఫేర్) డిపార్ట్మెంట్ ఉత్తర్వులు 1805 మరియు 1806 తేదీ 11/09/2023 విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ శ్రావణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి యస్ బాలాజీ లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని ఉద్యోగుల ఆరోగ్య పథకం  EHS అమల్లో ఉన్న  లోపాలను సరి చేసేందుకు తగు సూచనలు, సలహాలు ఇచ్చి ఉద్యోగులకు నాణ్యమైన ఆరోగ్య సదుపాయాలు కలిగేలా కృషి చేస్తామని వారు తెలిపారు.

About Author