దేశంలో ఆరెంజ్ అలర్ట్ !
1 min read
Water flowing along the street curb during heavy rain. Close up of splashing raindrops and air bubbles.
పల్లెవెలుగువెబ్ : దేశంలోని పలు రాష్ట్రాల్లో రుతుపవనాల ద్రోణి కారణంగా భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ తెలిపింది. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ సూచించింది. మూడు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో వర్షపాతం పెరిగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. పశ్చిమ మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. తమిళనాడులో జులై 27వతేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు. సోమవారం ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.