రోడ్డు ప్రాజెక్టుల్లో సామాన్యులూ పెట్టుబడి పెట్టొచ్చు !
1 min readపల్లెవెలుగువెబ్ : రోడ్డు ప్రాజెక్టులకు అవసరమైన నిధులను ప్రభుత్వం స్టాక్ మార్కెట్ నుంచి సేకరించనుందని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకోవచ్చన్న భయాలున్నప్పటికీ, మౌలిక రంగ ప్రాజెక్టుల ఫండింగ్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. ‘‘రోడ్డు ప్రాజెక్టులకు అవసరమైన నిధుల కోసం ప్రభుత్వం కాపిటల్ మార్కెట్‌ను ఆశ్రయిస్తోంది. ధనవంతులిచ్చే రుణాలను ఉపయోగించుకోదలుచుకోలేదు. షేర్ మార్కెట్‌కు వెళ్తున్నాను. అక్కడ చిన్న మదుపర్ల నుంచి రూ.లక్ష, రూ.2 లక్షలు ఇలా చిన్న మొత్తాల్లో పెట్టుబడులను సమీకరిస్తాం. వారి పెట్టుబడులపై 8 శాతం వార్షిక రిటర్నులు ఆఫర్ చేస్తున్నాం’ అ’ని మంగళవారం ఓ సదస్సులో గడ్కరీ పేర్కొన్నారు.