న్యాయ సేవ సదన్‌లో కంటి వైద్య శిబిరం ఏర్పాటు
1 min read– జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీ సి.హెచ్.వెంకట నాగ శ్రీనివాస రావు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: గౌరవ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మరియు కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఎన్. శ్రీనివాస రావు గారి ఆదేశాల మేరకు ఈ రోజు అనగా 20-04-2023 న న్యాయ సేవ సదన్ నందు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీ సి.హెచ్.వెంకట నాగ శ్రీనివాస రావు గారు గురువారం ఉదయం 10.30 గం!! నుంచి సాయంకాలం 04.00 గం!!ల వరకు వాసన్ ఐ కేర్ హాస్పిటల్ వైద్యుల వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబడింది. ఈ శిబిరం ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీ సి.హెచ్.వెంకట నాగ శ్రీనివాస రావు గారు ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు, న్యాయవాదుల గుమాస్తాలు మరియు కక్షిదారులు పాల్గొని ఉచిత కంటి వైద్య సహాయాన్ని పొందారు. ఇందులో సుమారు 108 మంది దాకా ప్రయోజనం పొందారు. ఈ కార్యక్రమంలో Optom తిరుపతమ్మ గారు, మార్కెటింగ్ మేనేజర్ శ్రీ శేషు నాయుడు గారు పాల్గొన్నారు.