PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వాలంటీరులకు ఓరియంటేషన్ .. రిఫ్రెషర్ శిక్షణ కార్యక్రమం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: సోమవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీ సి.హెచ్.వెంకట నాగ శ్రీనివాస రావు గారు న్యాయ సేవ సదన్ నందు పారా లీగల్ వాలంటీరులకు ఓరియంటేషన్ / రిఫ్రెషర్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీ సి.హెచ్.వెంకట నాగ శ్రీనివాస రావు గారు లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987లోని సెక్షన్ 12, న్యాయ సేవలకు అర్హులైన వ్యక్తులు ఎస్.సి., ఎస్.టి., మహిళలు, పిల్లలు మతిస్థిమితం లేని వారు వార్షిక ఆదాయం రూ. 3,00,000/- మించని వ్యక్తులు కూడా ఉచిత న్యాయ సహాయం పొందడానికి అర్హత కలిగి ఉన్నారు. అర్హత గల వాది, ప్రతివాదులు కూడా న్యాయ సహాయం పొందవచ్చును అని తెలియజేశారు. శ్రీమతి ఎస్. జూబెద బేగమ్, చైర్ పర్సన్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పనితీరు గురించి వివరించారు. శ్రీ హుస్సైన్ బాష, సూపరింటెండెంట్, ప్రభుత్వ బాలుర పరిశీలన గృహం, జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ మరియు రక్షణ) ఆక్ట్, 2000 నియమాలు, 2007 గురించి తెలియజేశారు. శ్రీమతి వి.నాగలక్ష్మి దేవి, న్యాయవాది, కర్నూలు మహిళలకు సంబంధించిన హక్కులను గురించి వివరించారు. చట్టం (సెక్షన్ 354 IPC) ఒక మహిళపై బలవంతంగా ప్రయోగించడం లేదా ‘ఆమె నిరాడంబరతను అతిక్రమించడమే’ ఉద్దేశం అయితే, బలవంతంగా ప్రయోగించమని బెదిరించడం కూడా ప్రత్యేక నేరంగా పరిగణించబడుతుంది. అటువంటి నేరాలకు వారెంట్ లేకుండా అరెస్టులు చేయడానికి పోలీసులను అనుమతించడం ద్వారా ఇది సాధారణ మరియు క్రిమినల్ ఫోర్స్ కంటే తీవ్రంగా పరిగణిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మహిళలు మరియు బాలికలు ఇప్పటికీ లింగం మరియు లింగం ఆధారంగా వివక్షను ఎదుర్కొంటున్నారు. శారీరక మరియు మానసిక ఆరోగ్యం యొక్క అత్యున్నత స్థాయిని ఆస్వాదించడానికి మహిళలు చదువుకోవాలి అని తేలేయజేశారు. శ్రీ ఎస్. మనోహర్, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ సిస్టమ్, కర్నూలు, శ్రీ ఎం.శివ రామచంద్ర రావు, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ సిస్టమ్, కర్నూలు వారు అర్హులైన వ్యక్తులకు నేర సంబంధిత విషయాలలో నాణ్యమైన మరియు సమర్థవంతమైన న్యాయ సేవలను అందించడం. క్రిమినల్ సంబంధిత విషయాలలో న్యాయ సహాయ వ్యవస్థను ఒక క్రమపద్ధతిలో నిర్వహించడం మరియు అమలు చేయడం. జిల్లా హెడ్ క్వార్టర్ పరిధిలోని క్రిమినల్ విషయాలకు సంబంధించిన న్యాయ సేవల విషయములకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తుంది. ఈ కార్యాలయం క్రిమినల్ జస్టిస్ ప్రారంభ దశల నుండి అప్పీలు దశల వరకు న్యాయ సేవలను అందిస్తుంది మరియు ప్రాతినిథ్యం లేని ఖైదీల్ న్యాయపరమైన అవసరాలను తీర్చడం కోసం జైళ్ళను సందర్శిస్తుంది. ప్రథమంగా ఈ కార్యాలము సివిల్ సంబంధిత విషయాలలో జోక్యం చేసుకోదు మరియు కౌన్సెల్ అసైన్ మెంట్ సిస్టమ్ ప్యానెల్ లాయర్లు ప్రయోజనం కోసం పని చేస్తుంది అని తేలేయజేశారు. ఈ కార్యక్రమంలో పారా లీగల్ వాలంటీరులు పాల్గొన్నారు.

About Author