ఉచిత ‘ ఆర్థో’ వైద్య శిబిరం
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: స్థానిక ఎన్ ఆర్ పేటలోని శిరీష పాలి క్లినిక్‌లో శనివారం ఆర్థో పెడిక్ వైద్య నిపుణులు డా. రవితేజా రెడ్డి పేదలకు ఉచిత వైద్య సేవలు అందించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 45 మంది రోగులు ఉచిత శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. శిబిరంలో ఎముకలు, కీళ్లు, నరముల కు సంబంధించి సమస్య ఉన్న వారు ఉచిత కన్సల్టెషన్ ఉపయోగించుకుని… వైద్య చికిత్స పొందారు. ఈ సందర్భంగా ఎముకలు, నరములు, వెన్నముక మరియు కీళ్ల మార్పిడి శస్ర్తచికిత్స నిపుణులు డా. ఎస్. రవి తేజ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం వైద్యం ఖర్చుతో కూడుకున్నదని, పేదలకు కొంతైనా సాయం చేయాలన్న సంకల్పంతో ప్రతి శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. రాయలసీమలోని ఏ జిల్లా వారైనా ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్థో పెడిక్ వైద్యులు డా. రవి తేజా రెడ్డి కోరారు.
