ఓర్వకల్లు విమానాశ్రయం లో ప్రయాణికుల అవసరాల మేరకు ఏర్పాట్లు చేయండి
1 min read
జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య
కర్నూలు, న్యూస్ నేడు : కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని జాయింట్ కలెక్టర్ బి.నవ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ లోని మిని కాన్ఫరెన్స్ హాలులో ఏరోడ్రోమ్ కమిటీ, ఎయిర్ ఫీల్డ్ ఎన్విరాన్మెంట్ కమిటీ సమావేశాన్ని జాయింట్ కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ… ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఏర్పోర్ట్ డైరెక్టర్ విధ్యా సాగర్ ను ఆదేశించారు. ఎయిర్పోర్ట్ ఆవరణంలో పచ్చదనాన్ని గణనీయంగా పెంచే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అందులో పండ్లను ఇచ్చే చెట్లు లేకుండా చూడాలని కోరారు. జిల్లా అధికారులు అందరూ ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ కు అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని జాయింట్ కలెక్టర్ కోరారు. ఎయిర్పోర్టులోని చెత్త ను గతంలో లాగా డంప్ యార్డు ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఓర్వకల్లు ఎంపీడీవో కు సూచించారు.ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్ డైరెక్టర్ విద్యాసాగర్ మాట్లాడుతూ 2024 సంవత్సరం లో ఏర్పోర్ట్ నందు యాంటీ హైజాక్ మరియు బాంబు బెదిరింపు కు చెందిన మాక్ డ్రిల్ నిర్వహించుకున్నామని జాయింట్ కలెక్టర్ కు తెలియజేశారు.ఈ సమావేశానికి ఎయిర్పోర్ట్ డైరెక్టర్ విద్యాసాగర్, డి ఎం అండ్ హెచ్ ఓ శాంతి కల, కర్నూలు డి ఎస్ పి బాబు ప్రసాద్, ఐబి డి ఎస్ పి మధు ,ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాసులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కిషోర్ రెడ్డి, డిడి మైన్స్ రవిచంద్ర, ఎలక్ట్రికల్ డి ఈ శేషాద్రి, ఎంపీడీవో శ్రీనివాసులు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
