NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఓటేసినందుకు.. ఉరేసుకునే ప‌రిస్థితి : నారా లోకేష్‌

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే నిరుద్యోగ స‌మ‌స్య ప‌రిష్కరిస్తామ‌ని చెప్పిన జ‌గ‌న్… ఇప్పుడు అదే ఫ్యాన్ కు ఉరేసుకునే ప‌రిస్థితి క‌ల్పించాడ‌ని టీడీపీ జాతీయ కార్యద‌ర్శి నారా లోకేష్ విమ‌ర్శించారు. ఎన్టీఆర్ భ‌వ‌న్ లో నారా లోకేష్ నిరుద్యోగ యువ‌త‌తో స‌మావేశం అయ్యారు. జాబ్ క్యాలెండ‌ర్ తో సీఎం జ‌గ‌న్ జాదూ క్యాలెండ‌ర్ విడుద‌ల చేశార‌ని ఎద్దేవా చేశారు. 2.30 ల‌క్షల ఉద్యోగాల‌ని చెప్పి.. 10 వేల ఉద్యోగాలు విడుద‌ల చేసి పండుగ చేస్కోమంటున్నార‌ని అన్నారు. రెండేళ్లలో 6 ల‌క్షల ఉద్యోగాలు క‌ల్పించామ‌ని యువ‌త‌ను మ‌భ్యపెట్టే ప్రయ‌త్నం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. జ‌గ‌న్ దెబ్బకు ప‌రిశ్రమ‌లన్నీ బాయ్ బాయ్ ఏపీ అంటున్నాయ‌ని అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల‌ను భ‌ర్తీ చేసేందుకు పోరాటం చేస్తామ‌ని నారాలోకేష్​ తెలిపారు.

About Author