ఓటిఎస్ ను రద్దు చేయాలి: భానుగోపాల్ రాజు
1 min readపల్లెవెలుగు రాయచోటి/వీరబల్లి :ఓటిఎస్ విధానాన్ని రద్దు చేయాలని టిడిపి మండల అధ్యక్షుడు ముద్దలూరు భానుగోపాల్ రాజు పేర్కొన్నారు. ఓటిఎస్ విధానాన్ని రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తూ టిడిపి నేతలు సోమవారం మండల కేంద్రంలోని గడికోట రోడ్డు నుండి నిరసన ర్యాలీ గా ఎంపీడీఓ కార్యాలయం వరకు నిర్వహించారు. అనంతరం ఎంపీడీఓ మధుసూదన్ రెడ్డి కి వినతిపత్రం అందజేశారు. ఈ సంధర్భంగా టిడిపి మండల అధ్యక్షుడు భానుగోపాల్ రాజు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వానికి ఆదాయం లేకపోవడంతో ఓటిఎస్ విధానం తీసుకొచ్చి పేద ప్రజల నుండి 10 వేలు రూపాయల చొప్పున రాబట్టడం దారుణమని ఆయన విమర్శించారు. అసలే కరువు కాటకాలు, కరోనా, వరదల భీభత్సంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వమే ఓటీఎస్ పేరుతో ప్రజలపై గుదిబండ మోపడం ఎంతవరకు న్యాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పూర్వ కాలం నివాసాలకు ఇప్పుడు ఓటీఎస్ తీసుకురావడాన్ని తాము టిడిపి తరుఫున వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయిస్తామని ఎవరూ డబ్బులు కట్టి మోసపోవద్దని ఆయన ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు కొల్లి రవినాయుడు, నాగసుబ్బమ్మ, బాస్కర్ రాజు, సుధాకర్ రాజు, నేతి రమేష్ బాబు, రాయ వెంకటేష్, రాయ వెంకటరమణ, హరి, సురేష్ కుమార్, శివయ్య, చంద్రశేఖర్ రాజు, వర్ల వెంకటరమణ, ప్రభాకర్ నాయుడు, రామక్రిష్ణంరాజు, తదితరులు పాల్గొన్నారు.