PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మా నమ్మకం నువ్వే జగనన్న మా భవిష్యత్తు నువ్వే

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: సోమవారం కర్నూల్ నగరం లోని కర్నూల్ ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ పార్టీ కార్యాలయం రాయల్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన మా నమ్మకం నువ్వే జగనన్న మా భవిష్యత్తు నువ్వే జగనన్న మీడియా సమావేశంలో మాట్లాడిన కర్నూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షురాలు సత్యనారాయణమ్మ రాష్ట్రంలో కోటి పైగా ఇళ్ళల వద్దకు వెళ్ళి మొట్టమొదటి సారిగా పీపుల్స్ సర్వే జరిగింది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశారు.నవరత్నాలలో భాగంగా అమ్మ ఒడి, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ ఫింక్షన్ ను ఇంటి వద్దకే చేరుతున్నాయి. రాష్ట్రంలో బిసి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదవులను కల్పించారు.రాష్ట్రంలో బిసిలకు పెద్ద పీట వేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ఇది చూసి ఓర్వలేక చంద్రబాబు, నారా లోకేష్ లు అసహనంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పై ప్రభుత్వం పై బురద చల్లడం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలను చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ యాత్రలు కొనసాగిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలోని కోటి పైగా ఇళ్ళలను పలకరించి, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనపై అభిప్రాయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుంది, టిడిపి పార్టీకి వచ్చే ఎన్నికల్లో కనుమరుగవుతుంది.మీడియా సమావేశంలో పాల్గొన్న నగర అధ్యక్షురాలు 25వ వార్డ్ కార్పొరేటర్ సత్యనారాయణమ్మ ,1వ వార్డ్ కార్పొరేటర్ షాషావలి ,13వ వార్డ్ కార్పొరేటర్ విజయలక్ష్మి ,12వ వార్డ్ మున్సిపల్ కో-ఆప్షన్ మెంబెర్ నయీమ్ పాషా , 46వ వార్డ్ కార్పొరేటర్ వాసు ,2వ వార్డ్&జిల్లా వాకఫ్ బోర్డు డైరెక్టర్ ఫైరోజ్ ,3వ వార్డ్ ఖాదర్ బాషా గా,పర్వీజ్ ఖాన్ గారు,5వ వార్డ్ శేషు యాదవ్ ,6వ వార్డ్ హకీమ్ భాయ్,9వ వార్డ్ నవీన్ ,22వ వార్డ్ మొయిన్ భాయ్ ,15వ వార్డ్ వెంకటేశ్వరమ్మ , సేవాదళ్ ప్రెసిడెంట్ కేదార్నాథ్ , 45వ వార్డ్ DVMC మెంబెర్ ప్రభుదాస్ , 14వ వార్డ్ మంజులత గారు, పర్ల సూర్యుడు ,18వ వార్డ్ చెన్నమ్మ గారు, సూర్య మోహన్ , బాబు , 51వ వార్డ్ కృష్ణ కాంత్ శర్మ గ,42వ వార్డ్ ఫయాజ్ ,44వ వార్డ్ రాజేష్ ,ఆంజనేయులు గారు, కృష్ణ ,రసూల్ , అబ్దుల్లా తదితరులు.

About Author