పత్తికొండ లో ప్రారంభమైన మా నమ్మకం నువ్వే జగన్
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ లో ఐదవ సచివాలయ పరిధిలో శనివారం గృహ సారధులు, కన్వీనర్ల ఆధ్వర్యంలో మా నమ్మకం నువ్వే జగన్ ప్రచార కార్యక్రమం విస్తృతంగా సాగింది. గత ప్రభుత్వం – ప్రస్తుత ప్రభుత్వం తేడాని వివరిస్తూ, పత్తికొండ లోని సచివాలయం 5 కన్వీనర్లు గృహ సారథులు వాలంటీర్లతో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. 5వ సచివాలయ సచివాలయ కన్వీనర్లు పల్లె ప్రతాప్ రెడ్డి ,రామచంద్ర , మండల కన్వీనర్ నాగరాజు ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యక్రమాల గురించి లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మా భవిష్యత్ మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం గురించి లబ్ధిదారులకు వివరిస్తున్నామని చెప్పారు. మా నమ్మకం నువ్వే జగన్ డోర్ స్టికర్,మొబైల్ స్టికర్లను గృహ యజమానుల అనుమతి తోనే అతికిస్తున్నామన్నారు అతికిస్తున్నామని అన్నారు. పేదవారి బతుకులు మారాలంటే భవిష్యత్తులో కూడా జగనన్న రావాలని ప్రతి ఇంటికి వెళ్లిన లబ్ధిదారులు సచివాలయం కన్వీనర్లకు గృహ సారధులు వాలంటీర్లతో తెలియజేశారు.గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల ద్వారా దోచుక తిన్నారని, ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వంలో వాలంటీర్లు గ్రామ సచివాల సిబ్బంది ద్వారా అవినీతికి తావు లేకుండా, పార్టీలకతీతంగా అమలు నేరుగా నేరుగా లబ్ధిదారులకు పథకాలను అందజేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు మల్లికార్జున,కృష్ణ మండల నాయకులు ఇమ్రాన్, వార్డ్ మెంబర్ రంగన్న,ఆస్పరిచంద్రా, కార్యకర్తలు వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.