NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘మా’ బిల్డింగ్.. బండ్ల గ‌ణేష్ సంచ‌ల‌న వ్యాఖ్యలు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ కు శాశ్వత భ‌వ‌నం నిర్మించాల్సిన అవ‌స‌రంలేద‌ని నిర్మాత బండ్ల గ‌ణేష్ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. మా అసోసియేష‌న్లో 900 మంది స‌భ్యులు ఉంటే.. వారిలో 150 మంది దారిద్ర్యరేఖ‌కు దిగువ‌న ఉన్నార‌ని, వారికి డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించి ఇస్తే ఆ కిక్కు వేరే లెవెల్ ఉంటుంద‌ని బండ్ల గ‌ణేష్ అన్నారు. ఓ ఇంట‌ర్వ్యూలో బండ్ల గ‌ణేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. స‌రైన ఆర్థిక స్థోమ‌త లేక చాలా మంది ఇబ్బందిప‌డుతున్నారని అన్నారు. ‘‘మా’ కి బిల్డింగ్ లేక‌పోతే ఇండ‌స్ట్రీ ఆగిపోదు. షూటింగ్ లు నిలిచిపోవు. సినిమాలు చూసే వారు త‌గ్గిపోరు’ అంటూ బండ్ల గ‌ణేష్ వ్యాఖ్యానించారు.

About Author