NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘మా’ స‌ర్కస్ : ఆర్జీవి

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: వివాదాస్పద ద‌ర్శకుడు రామ్ గోపాల్ వ‌ర్మ మ‌రోసారి త‌న స్టైల్లో కామెంట్ చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ను ఓ స‌ర్కస్ కంపెనీతో పోల్చాడు. ఇటీవ‌ల ‘ మా’ ఎన్నిక‌ల్లో గెలిచిన విష్ణు , ప్రకాశ్ రాజ్ ప‌ర‌స్పర ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు చేసుకుంటుండ‌గా.. వ‌ర్మ త‌న అసంతృప్తిని వ్యక్తం చేశాడు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఓ స‌ర్కస్ అని, అందులో ఉండే స‌భ్యులంతా జోక‌ర్లని అన్నారు. వ‌ర్మ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. దీనికి మంచు మ‌నోజ్ త‌న‌దైన స్టైల్లో రిప్లై ఇచ్చాడు. మా స‌ర్కస్ అయితే.. మీరు రింగ్ మాస్టార్ స‌ర్ అంటూ రిప్లై ఇచ్చాడు. వ‌ర్మ వైపు నుంచి ఎలాంటి రిప్లై వ‌స్తుందో చూడాలి.

About Author