PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘మా’ ఎన్నిక‌లు.. ప్రకాశ్ రాజ్ ప్రశ్నకు న‌రేష్ సెటైర్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : మా ఎన్నిక‌లు ద‌గ్గర‌ప‌డే కొద్దీ సినిమా న‌టుల మ‌ధ్య మాట‌లు తారాస్థాయికి చేరుతున్నాయి. ఎన్నిక‌ల‌కు ముందే ఎన్నిక‌ల వేడిని సిని‘మా’ వాళ్లు పుట్టిస్తున్నారు. మా ఎన్నిక‌లు ఎప్పుడంటూ ప్రకాష్ రాజ్ వేసిన ప్రశ్నకు సీనియ‌ర్ నటుడు న‌రేష్ వ్యంగ్యంగా స‌మాధానం ఇచ్చారు. మా ఎన్నిక‌లు ఎప్పుడు.. జ‌స్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ప్రకాశ్ రాజ్ ట్వీట్ కు కౌంట‌ర్ గా న‌రేష్ స్పందించారు. మా ఎన్నిక‌లు సెప్టెంబ‌ర్ లో జ‌రుగుతాయ‌ని చెప్పినా.. కొంద‌రు ప‌దేప‌దే ఎన్నిక‌లు ఎప్పుడు అని అడుగుతున్నారు. మా ఎన్నిక‌ల కోసం ఎదురుచూస్తున్నవారికి ఇదే మా స‌మాధానం అంటూ ట్వీట్ చేశారు. ఎన్నిక‌లు ఎప్పుడు అని అడిగేవారి ప‌రిస్థితి.. స్విమ్మింగ్ ఫూల్ లో నీళ్లు నింప‌కుండానే… స్విమ్మింగ్ ఫూల్ లోకి దూకేశానా ? అన్నట్టుంద‌ని వ్యాఖ్యానించారు.

About Author