గడప గడపకు మన ప్రభుత్వం..!
1 min readపల్లెవెలుగు, వెబ్ కోవెలకుంట్ల: కోవెలకుంట్ల మండలం రేవనూరు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న.. నంద్యాల పార్లమెంట్ సభ్యులు శ్రీ పోచా బ్రహ్మానందరెడ్డి గారు, బనగానపల్లె ఎమ్మెల్యే శ్రీ కాటసాని రామిరెడ్డి గారు, ఎమ్మెల్సీ శ్రీ చల్లా భగీరధ రెడ్డి .అలాగే “ఎంపీ నిధులతో లింగాల నుండి రేవనూరు వరకు 5 కి.మీ వాటర్ పైప్‌లైన్” మరియు గ్రామంలో నూతనంగా వేసిన సి.సి రోడ్డు ప్రారంభించారు.ఈ సందర్భంగా రేవనూరు హుస్సేన్ సా దర్గా ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ 3 సంవత్సరాలలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల గురించి ఇంటి ఇంటికి తిరిగి ప్రజలకు వివరించిన ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి గారు, ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు, ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి.