PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విజయవంతం..

1 min read

– ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మూడున్నరఏళ్లలో నాలుగు కోట్ల రూపాయలు బాధిత కుటుంబాలకు సహాయం..
– చిట్టివలస పాకల్లో క్యాన్సర్ తో పెద్దది ఎక్కువ కోల్పోయిన కుటుంబానికి 25 వేలు ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే ఆళ్ల నాని

పల్లెవెలుగు వెబ్ ఏలూరు : సంక్షేమ పాలనతో పేదలకు అన్ని విధాలా అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా కష్టాల్లో ఉన్న పేద కుటుంబాలకు రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి, ఏలూరు ఎమ్మెల్యే, ఏలూరు జిల్లా వైఎస్సార్ సిపి అధ్యక్షులు ఆళ్ల నాని ఎంతో అండగా నిలుస్తున్నారు. ఏలూరులో గత మూడున్నర సంవత్సరాల్లో ఆపదను ఎదుర్కొని కష్టాల్లో ఉన్న అనేక మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సుమారు రూ.4కోట్ల రూపాయల పైగా ఆర్ధిక సహకారం అందించి ఎన్నో పేద కుటుంబాలకు రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి, ఏలూరు ఎమ్మెల్యే, ఏలూరు జిల్లా వైఎస్సార్ సిపి అధ్యక్షులు ఆళ్ల నాని ఎంతో అండగా నిలిచారు. తాజాగా సోమవారం ఏలూరు కార్పొరేషన్ 33వ డివిజన్ చిట్టివలస పాకల్లో కార్పొరేటర్ యర్రంశెట్టి సుమన్ ఆధ్వర్యంలో జరిగిన 76వ రోజు గడప గడపకు కార్యక్రమంలో క్యాన్సర్ బారిన పడిన తన భర్త కరణం. జగన్మోహన్ రావు ని ఎంత వైద్యం అందించిన కాపాడుకోలేక పోయామని, గత నెలలో ఇంటి పెద్దను కోల్పోయామని బాధ పడుతు కరణం. నాగమణి అనే మహిళ తమ బాధను తెలిపారు.ఆమె బాధను విన్న మాజీ మంత్రి, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని ప్రభుత్వ పరంగా అవకాసం ఉన్న ఎటువంటి సహాయం అయినా వారికి అందేలా చేయాలని అధికారులకు సూచించారు.అంతే కాకుండా ఈరోజు 77వ రోజు గడప గడపకు కార్యక్రమంలో భాగంగా కుటుంబ పెద్దను కోల్పోయి సదరు కరణం. నాగమణి కి వైఎస్సార్ సిపి నాయకులు తోట.సుధీర్ ఆధ్వర్యంలో రూ.25వేల ఆర్ధిక సహాయాన్ని మాజి మంత్రి , ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళనాని చేతుల మీదుగా ఆమెకు అందచేసారు. ఈసందర్భంగా తమ బాధను విని, ఎంతో అండగా నిలచిన ఆళ్ల నానికి మహిళా, ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ షేక్ నూర్జహాన్, ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్ పర్సన్ మద్యాహ్నపు ఈశ్వరీ బలరాం, డిప్యూటీ మేయర్లు నూకపెయ్యి సుధీర్ బాబు, శ్రీనివాస్, మార్కెట్ యార్డ్ చైర్మన్ నెరుసు చిరంజీవులు, వైఎస్సార్ సిపి నాయకులు MRD బలరాం, కో-అప్షన్ సభ్యులు SMR పెదబాబు, ఏలూరు నగర అధ్యక్షులు బద్దాని శ్రీనివాస్, బీసీ నాయకులు లుక్కుర్తి సుభాష్ , వైయస్సార్సీపి నాయకులు తోట సుధీర్, సహా పలువురు కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

About Author