మా సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లి …న్యాయం చేయాలి
1 min read– ఎమ్మెల్యేను కలిసి న్యాయం చేయాలని కోరుతున్న వివోఏలు
పల్లెవెలుగు, వెబ్ రుద్రవరం: మండలంలోని ఆయా గ్రామాలలో వైయస్సార్ క్రాంతి పథకం స్వయం సహాయక సంఘాలకు గత 24 సంవత్సరాల నుండి వివో ఏలుగా తాము అనునిత్యం సేవలను అందిస్తున్నామని తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేయాలని ఆళ్లగడ్డ శాసనసభ్యులు గంగుల బిజేంద్ర రెడ్డిని కోరినట్లు వైయస్సార్ క్రాంతి పథకం నంద్యాల జిల్లా కన్వీనర్ ఎంవీ నరసింహులు తెలిపారు. ఆళ్లగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే గంగులను కలిసి తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని వివో ఏలు ఆదివారం వినతిపత్రం అందజేశారు. పొదుపు సంఘాల మహిళలకు చేస్తున్న తమ సేవలను గుర్తించిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల హామీలో పదివేల రూపాయలు గౌరవ వేతనం అందించి అమలు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. అర్హులైన వివో ఏ లకు సీసీలుగా ప్రమోషన్స్ సౌకర్యం కల్పించాలని మూడు సంవత్సరాల కాల పరిమితిని రద్దు చేస్తూ వివో ఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని 10 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని పదివేల నుండి 18 వేల రూపాయలకు గౌరవేతనం పెంచాలని తక్కువ సంఘాలు ఉన్న వివోఏలకు పదివేల రూపాయల గౌరవ వేతనం అందించాలని తదితర సమస్యలను పరిష్కరించేందుకు సీఎం దృష్టికి తీసుకువెళ్లి కృషి చేయాలని ఎమ్మెల్యేలు కోరడం జరిగిందని వివో ఏ నరసింహులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లక్క జయలక్ష్మి విజయరాణి రత్నం ఓబులేష్ తో పాటు పలువురు వివోఏలు పాల్గొన్నారు.