NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

`మా అక్క‌కు.. వ‌న‌మా రాఘ‌వ‌కు సంబంధం ఉంది ` !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇటీవ‌ల భ‌ద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచ‌కు చెందిన నాగ‌రామ‌కృష్ణ కుటుంబంతో పాటు ఆత్మ‌హ‌త్య చేసుకున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఇందుకు గ‌ల కార‌ణాల‌ను రామ‌కృష్ణ ఆత్మ‌హ‌త్య‌కు ముందు వీడియో చిత్రీక‌రించారు. దీనికి సంబంధించి రెండో సెల్ఫీ వీడియో వెలుగులోకి వ‌చ్చింది. ఈ వీడియోలో రామ‌కృష్ణ సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించారు. ‘‘మా నాన్న చిట్టబ్బాయి మోతుగూడెంలో హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసేవారు. 1992 అక్టోబరు 27న ఆఫీసు పనిపై డొంకరాయి గ్రామానికి వెళ్లి వస్తుండగా మోతుగూడెం పోలీసులు రోడ్డుమీద మానాన్న వస్తున్న వాహనం ఆపి లిఫ్ట్‌ అడిగారు. ఒకేఊరు కావడంతో లిఫ్ట్‌ ఇవ్వగా పోలీసు వాహనం అనుకుని నక్సలైట్లు బాంబ్‌ బ్లాస్ట్‌ చేయడంతో మా నాన్న సహా మొత్తం ఆరుగురు చనిపోయారు. ప్రధానంగా నేను ఈ పరిస్థితికి రావడానికి, ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి కారణం మొదటి సూత్రధారి వనమా రాఘవ. ఆయనకు, మా అక్క కొమ్మిశెట్టి మాధవికి సంబంధం ఉంది. మా అమ్మ కూడా సహకరిస్తూ ఆస్తిలో వాటా విషయంలో ఒప్పందాలు చేసుకున్నాక కూడా వాటిని ఇవ్వకుండా అప్పుల ఊబిలోకి నెట్టి చావే మార్గమనే పరిస్థితికి తీసుకొచ్చారు’’ అంటూ పదకొండున్నర నిమిషాలకు పైగా ఉన్న వీడియ‌లో సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించారు.

                                     

About Author