PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పల్లెవెలుగువెబ్​, హైదరాబాద్​: తెలుగు సినీ పరిశ్రమ ‘మా’(మూవీ ఆర్టిస్ట్స్​ అసోసియేషన్​) సమరానికి సిద్ధమయింది. అక్టోబరు 10వ తేదీ ఆదివారం ఉదయం 8గంటల నుంచి మధ్యహ్నం 2గంటల దాకా ‘మా‘ ఎన్నికలు హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్ లోని పబ్లిక్​ స్కూల్​ వేదికగా జరుగనున్నాయి. ఈ ఎన్నికలు పేపర్​ బ్యాలెట్​ విధానంలో జరుగనున్నాయి.
‘మా’ ఎన్నికల బరిలో ఓవైపు ప్రకాష్​రాజ్​​ ప్యానల్​ మరోవైపు మంచ విష్ణు ప్యానల్ పరస్పరం బలాబలాలు నిరూపించుకునేందుకు సిద్ధమయ్యాయి. గత కొద్దినెలలుగా ఇరు ప్యానళ్ల సభ్యుల మధ్య పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలతో పెద్ద ఎత్తున మాటల యుద్ధమే జరిగింది. సినీ పరిశ్రమ ఎప్పుడెప్పుడా..అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఇరు ప్యానళ్లు అటు వ్యక్తిగతంగానూ, ఇటు పోటీ పరంగా ప్రిస్టేజ్​ ఇష్యూగా తీసుకున్నాయి. ఇరు పక్షాలు గెలుపు తమదంటే.. తమదంటూ.. ధీమాతో ఉన్నాయి. ఉదయం 8గంటల నుంచి 2గంటల దాకా ఎన్నికలు జరిగాక… తదుపరి సాయంత్రం 4గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. కౌంటింగ్​ పూర్తయ్యాక రాత్రి 8గంటలకు ‘మా’ ఎన్నికల ఫలితాలను విడుదల చేస్తారు. ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్​ అసోసియేషన్​లో 925మంది సభ్యులు ఉన్నారు. ఇందులో 883మంది నటీనటులు ఓటు హక్కును వినియోగించుకుంటారు.
మా ఎన్నికల్లో అసోసియేషన్లోని 26మంది సభ్యులను ఎంపిక చేసుకోవడం కోసం ఒక్కొక్కరు 26ఓట్లు వేయాల్సి ఉంటుంది. రెండు ప్యానళ్ల నుంచి పోటీలో ఉన్న సభ్యలు ఎవరు గెలిచినా మొత్తం ఒకే ప్యానల్​గా పనిచేయాల్సి ఉంటుంది. అంటే..అధ్యక్ష పదవీలో గెలుపొందిన అభ్యర్థి ఆధ్వర్యంలో ఎంపికైన సభ్యులు ఒకే ప్యానల్​గా కొనసాగాల్సి ఉంటుంది. మా ఎన్నికల్లో క్రాస్​ ఓటింగ్​కే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ క్రమంలో పోటీలో ఉన్న ఒకే ప్యానల్​ సభ్యులు విజయం సాధించడం కష్టసాధ్యం.

About Author