PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రైతులకు న్యాయం జరిగేంత వరకు మా పోరాటం ఆగదు

1 min read

– కౌతాళం మండలం కామవరం గ్రామంలో ఎల్.ఎల్.సి హెడ్ రెగ్యులేటర్ దగ్గర వంట వార్పు చేస్తూ నిరసన వ్యక్తం చేసిన మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బాధ్యులు పాలకుర్తి తిక్కారెడ్డి చివరి ఆయకట్టు వరకు రైతులకు సాగునీరు సక్రమంగా అందించాలి.

పల్లెవెలుగు వెబ్ కౌతాళం : కామవరం గ్రామంలో     రైతులకు సాగునీటి సక్రమంగా అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రైతులకు న్యాయం జరిగేంత వరకు మా పోరాటం ఆగదని మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బాధ్యులు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు వారు కౌతాళం మండలం కామవరం గ్రామం దగ్గర ఉన్న ఎల్ ఎల్ సి హెడ్ రెగ్యులేటర్ దగ్గర వారు కాలువను పరిశీలించి అనంతరం రైతులతో కలిసి వంట వార్పు కార్యక్రమం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు వైసిపి నేతలు మాయ మాటలు చెప్పడం మాని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు నిరసన కార్యక్రమానికి భారీ ఎత్తున రైతులు చేరుకోని రైతులు పడుతున్న ఇబ్బందులు అన్ని పాలకుర్తి తిక్క రెడ్డికి తెలియజేశారు పాలకుర్తి తిక్కరెడ్డి మాట్లాడుతూ రైతులు ఇన్ని కష్టాలు పడుతుంటే వైసిపి ప్రభుత్వం గానీ స్థానిక ఎమ్మెల్యే   బాల నాగిరెడ్డి కాని చీమ కుట్టినట్లు కూడా లేదు అని రానున్న రోజుల్లో రైతులకు న్యాయం జరగకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ఎండిపోయిన పంటలకు తక్షణమే నష్టపరిహారం అందజేసి రైతులను ఆదుకోవాలని పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి అడివప్ప గౌడు, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చేన్నబసప్ప డేని, తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటపతి రాజు, జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి కోట్రేష్ ష్ గౌడ్, దూదేకుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు సాయిబాబా, కోసిగి మండల కన్వీనర్ జ్ఞానేష్, కాశీ విశ్వనాథ్ డేని, బాపురం వెంకటరెడ్డి, రమేష్ గౌడ్, మైనార్టీ నియోజకవర్గం అధ్యక్షులు టిప్పు సుల్తాన్, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి రాజాబాబు, ఉమేష్ గౌడ్, రంగస్వామి ,నబిసాబ్, చిన్న బొంపల్లి నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

About Author