శ్రీ లలితా పీఠంలో మన గుడి వేడుకలు ప్రారంభం
1 min readపల్లెవెలుగు, వెబ్ కర్నూలు: తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో కార్తిక మాసం సందర్భంగా మన గుడి కార్యక్రమం ప్రారంభమైనది . ఇందులో భాగంగా లలితా పీఠంలోని శ్రీ సుందరేశ్వర స్వామి వారికి అర్చకులు మామిళ్ళపల్లి జగన్ మోహన్ శర్మ ఆధ్వర్యంలో పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం జరిగినది. రాత్రి వై. రమణమూర్తి భాగవతార్ బృందం చేసిన హరికథా గానం భక్తులను అలరించింది. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి మాట్లాడుతూ సనాతన భారతీయ వైదిక ధర్మంలో ప్రతి పండుగకు, ప్రతి మాసానికి విశిష్టత ఉన్నదని, ఆ విశిష్టతను తెలియజేయుటకే తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు మన గుడి అనే పేరుతో సమాజంలో భక్తి భావన వ్యాప్తి చేస్తూఉందని తెలియజేశారు. నవంబర్ ఒకటవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు పండితులచే కార్తీక మాస వైశిష్యంపై ధార్మిక సప్తాహం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లలితా పీఠం పీఠాధిపతులు శ్రీ గురు మేడా సుబ్రహ్మణ్యం స్వామి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ః