మన ఊరు మన పొలం చర్చా వేదిక
1 min readపల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: కరువు సీమగా పేరుపొందిన రాయలసీమలో ఈ మధ్యకాలంలోనే పంట భూములకు నీళ్లు వస్తున్నాయి. వేసిన పంట బాగా పండుతుందో లేదో తెలియదు గిట్టుబాటు ధర వస్తుందో లేదో తెలియదు కానీ బాగా పండాలన్న ఉద్దేశంతో పురుగుమందు, భూమి ముందు అప్పు చేసైనా వాడుతాం,బాగా పండుతున్న పంటను మన కండ్ల ముందే అడవి పందులు నాశనం చేస్తున్నాయి. ఫారెస్ట్ అధికారులు ఇచ్చే నష్టపరిహారం జరిగిన నష్టంలో 10 శాతం కూడా రాదు. ఈ నష్టాన్ని ఇలాగే భరిద్దామా వీటికి పరిష్కారం ఆలోచిద్దామా అనే అంశంపై మన ఊరు మన పొలం అంటూ ఒక చర్చావేదికను ఆత్మకూరు ఎండిఓ ఆఫీస్ నందు గల మీటింగ్ హాల్ నందు 8వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటలకు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు రేనాటి ఎల్లారెడ్డి, శీలం శేషు చాపల రఫిక్, ఆంజనేయులు, కలిముల్లా,యునీస్. పుల్లయ్య. నాగేంద్ర, అబ్దుల్లా తెలిపారు ఈ కార్యక్రమానికి బాధిత రైతులు, మేధావులు పాల్గొని తగు సలహాలు సూచనలు ఇస్తే వాటిని ప్రభుత్వం దృష్టికి, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామని తెలిపారు.