NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మాది అభివృద్ధి చేసే ప్రభుత్వం.. మంత్రి టి.జి. భరత్

1 min read

రూ.28.12 కోట్ల అభివృద్ధి పనులకు భూమిపూజ

స్కాడ వ్యవస్థ నిర్వహణ కేంద్రం ప్రారంభం

ట్రిపుల్ ఐటీకు తాగునీరు అందించే పంపింగ్ స్టేషన్‌కు శంకుస్థాపన

పల్లెవెలుగు కర్నూలు: సోమవారం సమాజంలో మారుతున్న కాలానికనుగుణంగా అధునాతన సాంకేతిక సేవల వినియోగంతో, కష్టతరమైన సమస్యలను సైతం వేగవంతంగా పరిష్కరించవచ్చని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి. భరత్ అన్నారు. సోమవారం రూ.28.12 కోట్లకు సంబంధించి కీలకమైన అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్‌ పి. రంజిత్ బాషాతో పాటు మేయర్ బి.వై రామయ్య, ఎమ్మెల్యే గౌరు చరితరెడ్డి, కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు‌తో కలిసి మంత్రి భూమిపూజ చేశారు. అశోక్ నగర్ నీటి శుద్ధి కేంద్రం వద్ద రూ.4.62 కోట్లతో నీటి వ్యవస్థ నిర్వహణకు సంబంధించి పర్యవేక్షక వ్యవస్థ, సూపర్‌వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్ (స్కాడ) ను, రూ.1.5 కోట్లతో స్వచ్చ ఆంధ్ర‌ప్రదేశ్ కార్పొరేషన్ ద్వారా మంజూరైన 3 శుభ్రత పనుల యంత్రాల వాహనాలు, 2 చెత్త సేకరణ ఎలక్ట్రికల్ వాహనాలను ప్రారంభించారు. అదేవిధంగా జగన్నాథ గట్టు మీదున్న ట్రిపుల్ ఐటీకి, కల్లూరు ప్రాంతంలో వివిధ ప్రాంతాలకు తాగునీరు అందించేందుకు, వీకర్ సెక్షన్ కాలనీలోని పుచ్చలపల్లి సుందరయ్య పార్క్‌ వద్ద రూ.22 కోట్లతో 12 ఎం‌ఎల్‌డి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సంపు, పంపింగ్ స్టేషన్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ఎనిమిది నెలలుగా నగరంలో దశాబ్దాల నుండి ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కల్లూరు ప్రాంతంలో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి గత ప్రభుత్వంలో నామమాత్రపు జీవో జారీ చేశారని, బడ్జెట్ లేకుండా టెండర్ పిలిచేవారని విమర్శించారు. చిత్తశుద్ధితో నిజంగా కృషి చేసింటే ఈపాటికి పనులు పూర్తి అయ్యేవని, అయితే గత ప్రభుత్వంలో అది జరగలేదన్నారు. నగరానికి చుట్టూ నదులు ఉన్న నగర ప్రజలకు నీటి సమస్య తప్పలేదని, నూతన కాలనీల్లో నీటి సమస్య అధికంగా ఉందన్నారు. దీని పరిష్కారం కోసం పాణ్యం ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకున్నారని, సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు అర్థం చేసుకుని, ఆర్థిక ఇబ్బందుల్లో సైతం రూ.22 కోట్లు మంజూరు చేశారని, అందుకు ఎమ్మెల్యేకు, సిఎంకు ధన్యవాదాలు తెలిపారు. స్కాడ వ్యవస్థ సైతం గత ప్రభుత్వంలో ప్రచార ఆర్భాటం చేశారని, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే దీనిని తాత్కాలిక వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగిందని, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అమలు చేస్తున్న విధంగా భవిష్యత్తులో దీనిని మరింత అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. దీని వల్ల నీటి ప్రవాహం, నీరు ఎక్కడెక్కడికి ఎంత వెళ్తున్నాయి, ఔట్ ఫ్లో, ఇన్ ఫ్లో, పైపు లీకేజీ వంటి వివరాలను స్కాడ నిరంతర పర్యవేక్షణ వల్ల వెంటనే తెలుసుకోవచ్చని తెలిపారు. ఫలితంగా రోజువారీ తాగునీటి అవసరాలు, పరిష్కారాలు కనుకొవచ్చని, ఇవి మంచి సత్ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. కర్నూలు నగర పరిధిలోని మూడు నియోజకవర్గాల్లో తాగునీటి సమస్య పరిష్కారించే బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని, కచ్చితంగా పరిష్కారిస్తామని తెలిపారు.పాణ్యం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రిపుల్ ఐటీ డిఎం యూనివర్సిటీకి త్రాగునీటి సౌకర్యం కోసం రూ.22 కోట్ల రూపాయల వ్యయంతో పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో పనులకు అనుమతులు మాత్రమే మంజూరు చేశారని, నిధులు మాత్రం విడుదల చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే దీనిని ప్రారంభించడం జరిగిందన్నారు. ఫలితంగా కల్లూరు వార్డులలో త్రాగునీటి సమస్యను నివారించవచ్చన్నారు. అదేవిధంగా స్కాడ ఏర్పాటు వల్ల తాగునీరు ట్యాంకులను ఏ ట్యాంకులకు నీరు అందుతుందనే వివరాలను తెలుసుకొని సరి చేసుకునే అవకాశం ఉందన్నారు. పనులు పూర్తి అయితే నీటి సమస్య తీరుతుందని, తరువాత ప్రతిరోజు త్రాగునీటిని సరఫరా చేసుకునే అవకాశం వస్తుందని పేర్కొన్నారు. ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించుకోవాలంటే గోరకల్లు రిజర్వాయర్ నుండి నీటిని సరఫరా చేసుకోవాల్సిన అవసరం ఉందని, దాని కోసం ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేయబోతుందని ఎమ్మెల్యే తెలియజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *