PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బడి బయట పిల్లలు దూర విద్యా విధానాన్ని సద్వినియోగం చేసుకోండి

1 min read

– జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య

పల్లెవెలుగు వెబ్  కర్నూలు :  బడి మానేసి బడి బయట ఉన్న పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులు దూర విద్యా విధానాన్ని సద్వినియం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య పేర్కొన్నారు.బుధవారం కలెక్టరేట్ లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు ఆంధ్రప్రదేశ్ సార్యత్రిక విద్యా పీఠం(దూర విద్య విధానం) పదవ తరగతి మరియు ఇంటర్మీడియేట్ కు అడ్మిషన్స్ ప్రారంభం 2023-2024 కు సంబందించి గోడ పత్రికలను జాయింట్ కలెక్టర్ నారపు రెడ్డి మౌర్య ఆవిష్కరించారు.జాయింట్ కలెక్టర్ నారపు రెడ్డి మౌర్య మాట్లాడుతూ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ సార్యత్రిక విద్యా పీఠం(దూర విద్య విధానం) పదవ తరగతి మరియు ఇంటర్మీడియేట్ కు అడ్మిషన్స్  2023-2024 కు సంబందించి ప్రారంభమైనాయని బడి మధ్యలో మానేసిన  వారికి పదవ తరగతిలో ఫెయిల్ అయిన వారికి, పదవ తరగతి లో విద్యను అభ్యసించే అవకాశం, పదవ తరగతి పూర్తి చేసి 15 సంవత్సరాలు నిండిన వారికి ఇంటర్మీడియట్ లో చేరే అవకాశం దూర విద్యా ద్వారా ప్రభుత్వం  కల్పిస్తుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఓపెన్ స్కూల్స్ ద్వారా పదవ తరగతిలో ఉత్తీర్ణులైన వారితోపాటు నియత (రెగ్యులర్) పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసి వివిధ కారణాల వలన ఇంటర్మీడియట్ చదవలేకపోయిన వారికి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వారికొరకు సార్వత్రిక విద్యా విధానములో ఇంటర్మీడియట్ కోర్స్ అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కోర్సును 2010-11లో ప్రారంభించిందన్నారు. ఇది రెగ్యులర్ ఇంటర్మీడియట్ తో కూడా సమానం అన్నారు.ఈ కార్యక్రమంలో డీఈఓ రంగారెడ్డి, ఎగ్జామినేషన్స్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రభూషణరావు, తదితరులు పాల్గొన్నారు.

About Author