మహిళలకు బహిరంగ అత్యాచార బెదిరింపులు !
1 min readపల్లెవెలుగువెబ్ : ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక హిందూ సాధువు ముస్లిం మహిళలపై దుర్మార్గపు వ్యాఖ్యలు చేశారు. వారిని బహిరంగంగా అత్యాచారం చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఆరు రోజుల క్రితం జరిగినట్లు చెప్తున్న ఈ ఘటనపై శుక్రవారం సీతాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించారు. బహిరంగ ప్రదేశంలోనే వందల మంది ముందు సదరు సాధువు చేసిన విధ్వేష వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఈ కేసును సీనియర్ అధికారి విచారిస్తారని, వాస్తవాల ఆధారంగా చర్యలు తీసుకుంటారని సీతాపూర్ పోలీసులు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.