10 యూట్యూబ్ చానళ్ల పై వేటు
1 min readపల్లెవెలుగువెబ్: విద్వేషాలు రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్న శక్తులపై సమయానుకూలంగా కఠినంగానే వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. తాజాగా ఓ 10 యూట్యూబ్ ఛానెళ్లపై చర్యలు తీసుకుంది. ఈ 10 యూట్యూబ్ ఛానెళ్లకు సంబంధించిన 45 వీడియోలను పూర్తిగా బ్లాక్ చేసింది. ఈ మేరకు సోమవారం కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. కశ్మీర్, భారత సైన్యం, ఇటీవలే కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్‌లపై అసత్యాలను ప్రచారం చేసేందుకు ఈ 10 యూట్యూబ్ ఛానెళ్లు పక్కా ప్రణాళిక రచించినట్లు కేంద్రం గుర్తించింది. మార్ఫింగ్ వీడియోలతో తాము అనుకున్న అంశాలను జనంలోకి వెళ్లేలా చేయడానికి ఈ ఛానెళ్లు శతథా యత్నించిన వైనాన్ని గమనించిన కేంద్రం వెనువెంటనే వాటిపై చర్యలకు దిగింది.