20 లక్షల పైగా కార్డుల జారీ
1 min read
కీలక మైలురాయిని అధిగమించిన టాటా న్యూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు
కస్టమర్లకు విశిష్టమైన ప్రయోజనాలు, పొదుపులతో తోడ్పాటు
విజయవాడ న్యూస్ నేడు : కీలక మైలురాయిని సూచిస్తూ, 20 లక్షల పైగా టాటా న్యూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులను జారీ చేసినట్లు టాటా న్యూ మరియు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రకటించాయి. తద్వారా దేశవ్యాప్తంగా కస్టమర్లకు మరింత విలువను చేకూరుస్తూ, ప్రయోజనాలను అందించడంలో కార్డు విజయవంతమైనట్లు వివరించాయి. 2022 ఆగస్టులో ప్రవేశపెట్టినప్పటి నుంచి, ఈ క్రెడిట్ కార్డు భారతీయ మార్కెట్లో అత్యంత సరళమైన, పారదర్శకమైన రివార్డ్స్ వ్యవస్థను అందించడం ద్వారా వినియోగదారులు మెచ్చిన కార్డుగా మారింది. కొత్తగా జారీ ఆయిన కార్డుల్లో గణనీయమైన వాటాతో (RBI Q3 FY25 డేటా ప్రకారం కొత్తగా జారీ అయిన కార్డుల్లో 13% వాటా), ఇది దేశవ్యాప్తంగా వేగవంతంగా, వినియోగదారుల విశ్వాసాన్ని, విశ్వసనీయతను దక్కించుకుంది.
ప్రధానాంశాలు:
20 లక్షలకుపైగా కార్డులు జారీ – మార్కెట్లో అత్యధికంగా ఆమోదయోగ్యతను, వినియోగదారుల ప్రాధాన్యతను సూచిస్తుంది.
13% మార్కెట్ వాటా – ఆర్‌బీఐ డేటా ప్రకారం Q3 FY25లో కొత్తగా జారీ అయిన క్రెడిట్ కార్డులలో 13% వాటా, భారతదేశంలో అత్యధిక వాటా ఉన్న కో-బ్రాండెడ్ కార్డుల్లో ఇది కూడా ఒకటి.
సమగ్ర రివార్డ్స్ వ్యవస్థ – టాటా న్యూ వ్యవస్థవ్యాప్తంగా కిరాణా, మందులు, బిల్లుల చెల్లింపులు, UPI, గిఫ్ట్ కార్డులు, ఆర్థిక సేవల నుంచి ఫ్యాషన్, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, ట్రావెల్, వినోదం లాంటి జీవన శైలి ఆధారితమైన వాటి వరకు రివార్డులన్నీ సమగ్రంగా అనుసంధానించబడతాయి.అధిక వినియోగం – యూపీఐపై ప్రతి నెలా రూ. 800 కోట్ల వరకు విలువ చేసే 1.2 కోట్ల పైచిలుకు లావాదేవీలతో యూపీఐ ఫీచర్ ఎంతగానో విజయవంతమైంది. అత్యధికంగా వ్యయాలు నమోదవుతున్న కేటగిరీలు: గ్రోసరి, ఇంధనం, యుటిలిటీలు అత్యధికంగా వ్యయాలు నమోదవుతున్న టాప్ కేటగిరీలుగా ఉన్నాయి. మొత్తం వ్యయాల్లో వీటి వాటా దాదాపు 30 శాతం ఉంటోంది. రోజువారీ ఖర్చుల కోసం కస్టమర్లు ఎంచుకుంటున్న కార్డుగా దీని ప్రాధాన్యతను ఇది తెలియజేస్తుంది. వైవిధ్యమైన కస్టమర్ సెగ్మెంట్స్: విద్యార్థులు, రిటైరీలు, గృహిణులు మరియు స్వయం ఉపాధి పొందేవారులాంటి వివిధ వర్గాల అవసరాలను తీర్చే విధంగా పూర్తిగా డిజిటల్ రూపంలో, బ్యాంకింగ్‌కి సంబంధించి కొత్త కస్టమర్లకు ఫిక్సిడ్ డిపాజిట్లపై న్యూకార్డ్ ఆఫర్ చేయబడుతోంది. అత్యధిక విలువతో కూడుకున్న ఖర్చులు: ఎలక్ట్రానిక్స్ మరియు జ్యుయలరీ విభాగాల్లో అసాధారణంగా అత్యధిక స్థాయిలో వ్యయాలను నమోదు చేయడమనేది న్యూకార్డ్ ఆకర్షణీయతను సూచిస్తోంది. డిజిటల్ సామర్థ్యాలు: డిజిటల్ ఆన్‌బోర్డింగ్, తక్షణ అప్రూవల్స్, కాంటాక్ట్‌రహిత లావాదేవీలు మొదలైనవన్నీ ఆధునిక డిజిటల్ జీవనవిధానాలకు అనుగుణంగా ఉంటాయి. దేశవ్యాప్తంగా అందుబాటులో: మెట్రోపాలిటన్ మరియు చిన్న పట్టణాల్లో కూడా వివిధ వర్గాల వారికి అందుబాటులో ఉండటం దీని ఆకర్షణీయతను సూచిస్తోంది. “క్రెడిట్ కార్డ్ వినియోగ అనుభవాన్ని విప్లవాత్మకంగా తీర్చిదిద్దేందుకు, వినియోగదారులకు మరింత పారదర్శకమైన, ఉపయోగకరమైన ప్రయోజనాలను అందించేందుకు టాటా డిజిటల్ కట్టుబడి ఉంది. టాటా న్యూ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డు 20 లక్షల కార్డుల మైలురాయిని దాటడం టాటా న్యూపై వినియోగదారులకున్న విశ్వాసానికి నిదర్శనం. మేము న్యూకార్డ్ అనుభవాన్ని నిరంతరం మెరుగుపరచడానికి కృషి చేస్తూనే ఉంటాము” అని టాటా డిజిటల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ (ఫైనాన్షియల్ సర్వీసెస్) గౌరవ్ హజ్రతి (Gaurav Hazrati) తెలిపారు.