NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క‌ర్నూలు కిమ్స్‌లో 50కి పైగా కిడ్నీ మార్పిడులు

1 min read

అవ‌యవ‌ దానానికి ముందుకొచ్చిన

క‌ర్నూలు క‌లెక్టర్ రంజిత్ బాషా

అత్యాధునిక స‌దుపాయాలు, అనుభ‌వ‌జ్ఞులైన వైద్యులు

కిమ్స్ ఆస్పత్రుల గ్రూప్ సీఎండీ డాక్టర్ బి.భాస్కర‌రావు

లక్షమందితో అవయదానానికి శ్రీకారం

క‌ర్నూలు, న్యూస్​ నేడు : మ‌న తెలుగు రాష్ట్రాల్లోనే ఏటా కొన్ని వేల మంది స‌రైన స‌మ‌యంలో అవ‌య‌వాలు దొర‌క్క మ‌ర‌ణిస్తున్నార‌ని, అందువ‌ల్ల అవ‌కాశం ఉన్న ప్రతి ఒక్కరూ అవ‌య‌వ‌దానానికి ముందుకు రావాల‌ని క‌ర్నూలు జిల్లా క‌లెక్టర్ రంజిత్ బాషా పిలుపునిచ్చారు. తాను సైతం అవ‌య‌వదానానికి ప్రతిజ్ఞ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివ‌ర‌కు 50కి పైగా కిడ్నీ మార్పిడుల‌ను విజ‌య‌వంతంగా చేసిన క‌ర్నూలు కిమ్స్ ఆస్పత్రి యాజ‌మాన్యాన్ని, వైద్యుల‌ను ఆయ‌న అభినందించారు. ఈ సంద‌ర్భంగా ఆస్పత్రి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఒక ప్రత్యేక కార్యక్రమానికి ఆయ‌న ముఖ్య అతిథిగా హాజ‌రై ఇప్పటివ‌ర‌కు కిమ్స్ ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి శ‌స్త్రచికిత్స‌లు చేసిన వైద్యుల‌ను క‌లెక్టర్ చేతుల‌మీదుగా స‌త్కరించారు. త‌ర్వాత కిడ్నీ దాత‌ల‌ను కూడా స‌త్కరించారు.  ఈ కార్యక్రమంలో కిమ్స్ గ్రూప్ ఆస్పత్రుల సీఎండీ, ప్రముఖ కార్డియోథొరాసిక్ స‌ర్జన్ డాక్టర్ బొల్లినేని భాస్కర‌రావు మాట్లాడుతూ.. “క‌ర్నూలు ప్రాంతం ఎప్పటినుంచో వైద్యసేవ‌ల‌కు పేరెన్నిక గ‌న్నది. ఇలాంటి ప్రాంతంలో అత్యాధునిక వైద్య సదుపాయాల అవ‌స‌రం ఉంద‌ని గుర్తించి ఇక్కడ మా ఆస్పత్రిని ప్రారంభించాం. వివిధ విభాగాల్లో అత్యంత అనుభ‌వం ఉన్న వైద్య నిపుణులు, అత్యాధునిక వైద్య స‌దుపాయాల‌ను ఇక్కడ క‌ల్పించాం. రాయ‌ల‌సీమ వాసుల‌కు మా సేవ‌లు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. ఇప్పటికి 50కి పైగా కిడ్నీ మార్పిడులు చేయ‌డం, అదీ 96% విజ‌యాల రేటుతో చేయ‌డం” అభినందనీయం అని చెప్పారు. అనంతరం కిమ్స్ కర్నూలు సీఓఓ డాక్టర్ సునీల్ సేపూరి మాట్లాడుతూ ఈ సందర్భంగా రాయలసీమ వ్యాప్తంగా జీవనదాన్ వెబ్ సైట్ లో లక్షమందితో అవయదానానికి అంగీకారానికి పేర్లు నమోదు కార్యక్రమానికి తాము శ్రీకారం చూట్టామని తెలిపారు. ఈ కార్యక్రమానికి క‌ర్నూలు జిల్లా క‌లెక్టర్ రంజిత్ బాషా ప్రారంభించారు. కిమ్స్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డా. భాస్కర్ రావు అవయవదానం చేస్తానని జీవన్ ధాన్ వెబ్ సైట్ లో పేరు నమోదు చేసుకున్నారు. అనంతరం జీవన్ ధాన్ నుంచి వచ్చిన సర్టిఫికెట్ చూపించారు.కార్యక్రమంలో కిమ్స్ ఆస్పత్రికి చెందిన కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ నిపుణులు డాక్టర్‌ ఉమా మహేశ్వరరావు, నెఫ్రాలజిస్ట్ డాక్టర్‌ అనంతరావు, యూరాలజిస్ట్ డాక్టర్‌ మనోజ్ కుమార్, అనస్థటిస్ట్ డా. బాల సుబ్రమణ్యం  త‌దిత‌రులు మాట్లాడారు. క‌ర్నూలు కిమ్స్ ఆస్పత్రి సీఓఓ డాక్టర్ సునీల్ సేపూరి, ట్రాన్స్ ప్లాంట్ సర్వీసెస్ మంగాదేవి, క‌ర్నూలు డీఎంహెచ్ఓ డాక్టర్ శాంతిక‌ళ‌, క‌ర్నూలు ప్రభుత్వ వైద్యక‌ళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టి న‌ర‌స‌మ్మ‌, క‌ర్నూలు జీజీహెచ్ సూప‌రింటెండెంట్ డాక్టర్ కె.వెంక‌టేశ్వర్లు, డా. సుధాకర్, డా. రఫీక్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *