PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

800 మందికి పైగా ఉచితంగా గుండె స్క్రీనింగ్ టెస్ట్ లు

1 min read

– 6 వేల మంది పైగా ప్రతిజ్ఞ చేయించి రికార్డ్ నెలకొల్పిన ‘జెమ్ కేర్ కామినేని హాస్పిటల్స్  కర్నూలు.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ‘జెమ్ కేర్ కామినేని హాస్పిటల్స్ కర్నూలు వారు ‘ ఒకే రోజు 800 పైగా గుండె స్క్రీనింగ్ టెస్ట్ లు ఉచితంగా చేయడంతోపాటు 6వేల మంది పైగా ప్రతిజ్ఞ చేయించి ఒక రికార్డ్ సృష్టించింది. ఒకే రోజు ఇంత మందికి స్క్రీనింగ్ టెస్ట్ లు ఉచితంగా చేయడం రాయలసీమ లోనే  ప్రథమం.వరల్డ్ హార్ట్ డే సందర్బంగా’ జెమ్ కేర్ కామినేని హాస్పిటల్స్’ లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ కార్డియాలజీ వైద్య నిపుణులు డాక్టర్ రాఘవేంద్ర చెరుకు  ,  సి టి వీ యస్ సర్జన్ డాక్టర్ సుధీర్ కుమార్ ,  కార్డియాక్ అనేస్తేషియా డాక్టర్ కే. ఆదిత్య మాట్లాడుతూ  మనిషి అవయవాలలో ఎంతో ప్రాధాన్యత కలిగిన గుండె(హృదయం)కు ఎలాంటి అనారోగ్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు.ప్రతి ఒక్కరూ మంచి ఆహారం తీసుకుంటూ చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా వుంటే గుండె పనితీరు బాగా వుంటుందన్నారు.వరల్డ్ హార్ట్ డే సందర్బంగా’ జెమ్ కేర్ కామినేని హాస్పిటల్స్’ అందిస్తున్న ఉచిత గుండె (స్క్రీనింగ్ టెస్టు లు) వైద్య పరీక్షలు పాటు ఒక కొత్త ప్యాకేజీ (RS 499 /-  కు ఈసీజీ , 2d ఎకో,  మరియు కార్డియాలజీ కన్సల్టేషన్) పొందవచ్చన్నారు.ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు.హాస్పిటల్ ఏం. డి. & సి ఈ ఓ డాక్టర్ యెస్. వి.చంద్ర శేఖర్ , మరియు డాక్టర్ జి.వి.యెస్ రవి బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలన్నారు.అలాగే బి.పి, షుగర్ లను పెరగకుండా  చూసుకోవాలన్నారు.ఇంకా బరువును నియంత్రించుకోవడం, కొలెస్ట్రాల్  పెరగకుండా,దూమ పానం, మద్యపానం లకు దూరంగా వుండాలి,ప్రతి రోజూ యోగ చేయడం,కనీసం రోజుకు ఒక అరగంట నడవడం వంటివి చేయడం ద్వారా ఎలాంటి గుండె వ్యాధి రాకుండ ఆరోగ్యంగా వుండవచ్చన్నారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా  జెమ్ కేర్ కామినేని హాస్పిటల్స్ యాజమాన్యం కార్డియాలజీ & సి టి వీ యస్ విభాగాలలో వైద్య సేవలందించిన వారిని ఈ  సత్కరించి బహుమతులను అందజేశారు.కార్యక్రమంలో. సి. ఓ. ఓ. డాక్టర్ గణేష్ ,మార్కెటింగ్ హెడ్ రమణ బాబు,ఆపరేషన్స్ హెడ్ నదీమ్ మరియు హాస్పిటల్స్ సిబ్బంది పాల్గొన్నారు.

About Author