ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని కూలదోయండి.. పుతిన్ ప్రకటన !
1 min read
పల్లెవెలుగువెబ్ : రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఉక్రెయిన్ తో చర్చలకు సిద్ధమని ప్రకటించిన కొద్దిసేపటికే విరుద్ధమైన ప్రకటన చేశారు. ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని కూలదోయాలంటూ ఉక్రెయిన్ సైన్యానికి పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ ను హస్తగతం చేసుకోవాలని సూచించారు. ఉక్రెయిన్ నాయకత్వాన్ని అభినవ నాజీలు, ఉగ్రవాదులు, డ్రగ్స్ ముఠాగా పుతిన్ అభివర్ణించారు. శుక్రవారం ఓ టీవీ చానెల్ లో ప్రసంగిస్తూ పుతిన్ ఈ ప్రకటన చేశారు.