ఈయన 22 లక్షల ఎకరాలకు యజమాని !
1 min read
పల్లెవెలుగు వెబ్: జాన్ మెలాన్. అమెరికాలోని అతిపెద్ద భూస్వామి. మల్టీమిలీనియర్ అయిన జాన్ మెలాన్ లిబర్టీ మీడియా చైర్మన్. అనేక వ్యాపారల్లో ఆయనకు భాగస్వామ్యం ఉంది. అమెరికాలోని ధనవంతుల్లో ఆయన ఒకరు. ఆయనకు ఎంత భూమి ఉందో తెలిస్తే ఆశ్చర్యపోవడం మనవంతు అవుతుంది. ఐదు, పదెకరాలు కాదు ఏకంగా 22 లక్షల ఎకరాల భూమి ఆయన పేరు మీద ఉంది. అమెరికాలోని నెంబర్ వన్ భూస్వామి. మొదటగా పెన్సిల్వేనియాలో 2,90,100 ఎకరాలు కొనుగోలు చేశారు. తర్వాత ఫ్లోరిడాలో 800 ఎకరాలు బ్రిడిల్ వుడ్ ఫామ్స్ కొన్నారు. మేరీల్యాండ్, మైనే, హ్యాంప్ షైర్, కొలరాడో, వ్యోమింగ్ ప్రాంతాల్లో భూమిని కొనుగోలు చేశారు. 2011లో ఒకేసారి 12 లక్షల ఎకరాల భూమిని మైనేలో కొనుగోలు చేశారు. భూమి పైనే కాకుండా షిప్పింగ్, టెలీకమ్యూనికేషన్స్, రేసింగ్, గేమ్స్ లాంటి రంగాల్లో జాన్ మెలాన్ పెట్టుబడి పెట్టారు.